తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధులకు దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వద్దకు దూసుకొచ్చి మా పొట్టకొట్టొద్దంటూ ప్రాదేయపడింది.
మా పొట్టలను కొట్టొద్దు…పాదాలు పట్టుకుంటా..తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం.. ఉన్న కొలువులు పోతాయని ఉహించలే… మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా పర్వాలేదు.. ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయండి సార్ అంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాళ్లు పట్టుకుంటూ వేడుకుంది.
తెలంగాణ ఉద్యమం లో పోరాడినం…. మాకు గతంలో ఉన్న కొలువులు మాకివ్వండి. కొంగు పట్టి అడుగుతున్న మీ బిడ్డ లాంటిదాన్ని సారు… అంటూ పల్లా ముందు కూలబడి ప్రాదేయపడింది. ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు కొంగు సాపి కాళ్ళు మొక్కుతూ ఉద్యోగాన్ని అడుక్కుంటున్న దృశ్యం అందరినీ కలిచి వేసింది.
Read more: