Telangana: ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం.. సంకల్ప పత్రాలతో విద్యార్థులకు అవగాహన..

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. పారదర్శక పాలన కావాలన్నా.. మంచి నాయకులు పరిపాలించాలన్నా ఓటుతోనే సాధ్యం. అలాంటి బృహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ.. ఓటు హక్కు వినియోగంపై సంకల్ప పత్రాల పేరుతో పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి ఎన్నికలైనా ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచే దిశగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Telangana: ఓటు హక్కు వినియోగంపై వినూత్న కార్యక్రమం.. సంకల్ప పత్రాలతో విద్యార్థులకు అవగాహన..
Ec Awareness Program
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 13, 2024 | 1:45 PM

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. పారదర్శక పాలన కావాలన్నా.. మంచి నాయకులు పరిపాలించాలన్నా ఓటుతోనే సాధ్యం. అలాంటి బృహత్తర బాధ్యతను గుర్తుచేస్తూ.. ఓటు హక్కు వినియోగంపై సంకల్ప పత్రాల పేరుతో పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన చేపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి ఎన్నికలైనా ఓటు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. పార్లమెంట్ ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల సంఘం ఓటు హక్కు వినియోగంపై చైతన్య పరిచే దిశగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ర్యాలీలు, అవగాహన సదస్సులు వంటి అవగాహన కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ చేపడుతోంది. అయితే యాదాద్రి జిల్లాలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వాములను చేసింది. రాజపేట పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రుల్లో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తూ వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు.. అని కరపత్రాలను ముద్రించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి.. తమ తల్లిదండ్రులతో చదివించి బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన సంకల్ప కరపత్రాలను ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ సంకల్ప పత్రాలను ఇంటికి తీసుకువెళ్లి తల్లిదండ్రులతో చదివించాలని టీచర్లు విద్యార్థులకు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. సంకల్ప కరపత్రాల్లో ముద్రించారు. పోలింగ్ రోజున మరోసారి గుర్తు చేస్తామని విద్యార్థుల బాధ్యతను కూడా ఈ సంకల్ప పత్రాల్లో ముద్రించారు. ప్రజాస్వామ్య మనుగడకు, దేశాభివృద్ధికి ఓటు మూలస్తంభం లాంటిదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో స్వీప్‌ కార్యక్రమం ద్వారా ఓటు వినియోగంపైనా, ప్రాధాన్యతపైనా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులను చైతన్య పరిచే దిశగా చేపట్టిన కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం పట్ల అధికారులను అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!