ఓ కోడిగుడ్లు రకరకాల రంగుల్లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.. తెల్లని, నల్లవి, బ్రౌన్ కలర్ రంగుల్లో కోడి గుడ్లు ఉంటాయి. కొన్ని గుడ్లు పెద్ద పరిమాణంలో ఉంటే మరికొన్ని గుడ్లు చిన్నగా ఉంటాయి. అంతేకాదు ఒకొక్కసారి గుడ్లలో రెండు పచ్చ సొనలు ఉన్నవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఓ వింత సైజుల్లో గుడ్లు పెడుతున్న కోడి హల్ చల్ చేస్తోంది. ఓ కోడి పెట్ట చాక్లెట్ సైజులో కోడిగుడ్లు పెట్టింది. ఇది బుజ్జి బుజ్జిగా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ వింత గుడ్డును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదేమి కోడి రా బాబూ ఇలా పెట్టింది. గుడ్డూ అంటూ షాక్ అవుతున్నారు. ఈ వింత ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లాలో వింత కోడిగుడ్డు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఖానాపూర్ పట్టణం విద్యానగర్‌కు చెందిన శ్రావణ్ గత కొన్ని సంవత్సరాలుగా కోళ్ళను పెంచుతున్నాడు. అతనికున్న 20 కోళ్ళలో ఒక కోడి వారం రోజల నుండి సాధారణంగా గుడ్లను పెడుతుంది. నిన్న గుల్ల కింద కమ్మిన కోడి గుడ్డు పెట్టిందాని చూస్తే అతి చిన్నగా గుడ్డు కనబడింది. దీంతో అవాక్కైన శ్రావణ్ పరిశీలించి చూస్తే చాక్లెట్ సైజ్‌లో ఉన్న అతి చిన్న గుడ్డు… ఇంకేముంది ఈ వింతను చూడటానికి గ్రామస్తులందరూ క్యూ కట్టారు. 20 సంవత్సరాలుగా కోళ్ళను పెంచుతున్నా ఇప్పటివరకు ఇలాంటి వింతను చూడలేదన్నారు. ఇది జన్యుపరమైన లోపమా ఇంకా మరేదైన మాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు జంతు ప్రేమికుడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..