Telangana: ఒక్క రూపాయి తేడా.. ఏకంగా తలలే పగిలాయి.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!

|

Aug 23, 2022 | 1:03 PM

Telangana: మద్యం సేవిస్తే.. మత్తు నశాలానికెక్కుతుంది.. ఫలితంగా ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం అనే సోయి అసలే ఉండదు. ఆ మత్తు ఒక్కోసారి కొంపలు ముంచుతుంది.

Telangana: ఒక్క రూపాయి తేడా.. ఏకంగా తలలే పగిలాయి.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!
One Rupee
Follow us on

Telangana: మద్యం సేవిస్తే.. మత్తు నషాలానికెక్కుతుంది.. ఫలితంగా ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం అనే సోయి అసలే ఉండదు. ఆ మత్తు ఒక్కోసారి కొంపలు ముంచుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక్క రూపాయి తేడా కారణంగా.. తలలు పగిలేలా కొట్టుకున్నారు. తీవ్ర రక్తస్త్రాం అయి కొందరు ఆస్పత్రిపాలైతే.. గాయాలకు కారణమైన వారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ ఘటన సూర్యాటపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కోదాడ పట్టణంలో ఇద్దరు మందుబాబులు రచ్చ రచ్చ చేశారు. అనంతగిరి మండలం గోల్ తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం తాగేందుకు కోదాడలోని ఓ వైన్స్ స్టోర్‌కి వచ్చారు. మందుతో పాటు.. వాటర్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. అయితే, వాటర్ ప్యాకెట్‌కు రూపాయి అధికంగా తీసుకున్నారంటూ షాపు నిర్వాహకుడితో ఘర్షణకు దిగారు. షాపు నిర్వాహకులు, మందుబాబుల మధ్య మాటా మాటా పెరిగి.. అది కాస్తా భౌతిక దాడుల వరకు వెళ్లింది. కౌంటర్‌ బల్లాపై ఉన్న మద్యం సీసాలను పగలగొట్టి మందుబాబులు హంగామా చేయగా.. వైన్స్ నిర్వాహకుడు బయటకు వచ్చి బీర్ సీసా తీసుకుని ఓ మందుబాబు తలపై కొట్టాడు. దాంతో అతని తల పగిలి తీవ్ర రక్తస్త్రావంతో అక్కడే పడిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వైన్ షాపు వద్దకు చేరుకున్నారు. గాయపడిన మందుబాబును ఆస్పత్రికి తరలించారు. ఘర్షణకు పాల్పడిన అందరినీ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..