Cyber Fraud: ఒక్క కాల్‌తో కోట్లు కొట్టేస్తున్న సైబర్ మాఫియా.. నెల రోజుల్లో 100 మంది ట్రాప్..!

టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇటీవల పార్సిల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొరియర్ సంస్థల పేర్లు చెప్పి వాటిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ అమాయకులను మభ్యపెడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి.

Cyber Fraud: ఒక్క కాల్‌తో కోట్లు కొట్టేస్తున్న సైబర్ మాఫియా.. నెల రోజుల్లో 100 మంది ట్రాప్..!
Cyber Criminals
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 30, 2024 | 11:36 AM

టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇటీవల పార్సిల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొరియర్ సంస్థల పేర్లు చెప్పి వాటిలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయంటూ అమాయకులను మభ్యపెడుతున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన అధ్యయనంలో సంచలనాలు బయటపడుతున్నాయి.

తాజాగా ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో మొత్తం 110 మందికి సైబర్ నేరగాళ్లు పార్సెల్ పేరుతో ఫోన్ కాల్స్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ 110 మంది సాధారణ వ్యక్తులు కూడా కాదు. వీరిలో అధిక శాతం హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం విశేషం. వీరి ఫోన్ నెంబర్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పార్సిల్ వచ్చిందంటూ ఫోన్లు చేసి, వీరి వద్ద నుండి కోట్ల రూపాయలు కాజేస్తున్నారు.

మోసం జరుగుతున్న తీరు ఇదే..!

కొరియర్ సంస్థ నుండి మాట్లాడుతున్నామని ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. తమ పేరు మీద డ్రగ్స్ లేదా అనుమానాస్పద పార్సెల్ వచ్చిందంటూ బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తారు. తాము పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని నమ్మ పలుకుతారు. అప్పటికే భయపడుతూ ఉన్న బాధితులకి స్కైప్ ఐడి ద్వారా వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో యూనిఫామ్ వేసుకున్న ఒక ముంబై పోలీస్ అధికారి మాట్లాడేలా ఒక ఫేక్ వీడియోను తయారుచేస్తారు. ఈ కేసు ముందుకు వెళ్లకుండా ఉండాలంటే సెటిల్ చేసుకోవాల్సిందిగా బాధితుడిని ప్రేరేపిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా కొరియర్ సంస్థల పేర్లతో జరుగుతున్న మోసాలు గత సంవత్సరం నుండి వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి.

సుమారు 110 మంది బాధితులను ట్రాప్ చేసిన కేటుగాళ్ళు

హైదరాబాదులోనూ ఈతరహా మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలో సుమారు 110 మంది బాధితులు సైబర్ నేరగాలని ట్రాప్ లో పడి తీవ్రంగా నష్టపోయారు. వీరిలో ఐటి ప్రొఫెషనల్స్ తో పాటు హై ప్రొఫైల్ ఉద్యోగాలు చేస్తున్న వారు అధికంగా ఉన్నారు.. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లకు భయపడి డబ్బులు చెల్లించి ఉంటే డబ్బులు పంపిన రెండు గంటల్లోపే పోలీసులను ఆశ్రయిస్తే నిందితుల ఖాతాలోని డబ్బులను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

స్పెషల్ కౌన్సిలింగ్ సెల్ ఏర్పాటు

అయితే కొంతమంది డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాస్త మొహమాటపడుతుంటారు. అలాంటి వ్యక్తులు డబ్బులు పోయాయి అనే బాధతో ఆత్మహత్య వరకు వెళ్లే ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. అలాంటి బాధితుల కోసం స్పెషల్ కౌన్సిలింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేశారు.. ఈ కౌన్సిలింగ్లో ట్రెయిన్డ్ ప్రొఫెషనల్స్ తో బాధితులకి అండగా నిలుస్తారు.ఎవరూ కూడా పార్సెల్ పేరుతో వచ్చే కాల్స్ కు భయపడాల్సిన పనిలేదని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?
చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుంది?
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ఉద్వేగభరిత ప్రసంగం..!
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!