V Hanumantha Rao: ఆయన రూటే సపరేటు.. తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దూకుడు..

|

Dec 15, 2021 | 6:09 PM

Congress Senior Leader VH: జాతీయ పార్టీలో ఆయన సీనియర్ లీడర్.. పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరుతెచ్చుకున్నారు. అంతేకాదు ఆనాటి నేతలతో

V Hanumantha Rao: ఆయన రూటే సపరేటు.. తెలుగు రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దూకుడు..
V Hanumantha Rao
Follow us on

Congress Senior Leader VH: జాతీయ పార్టీలో ఆయన సీనియర్ లీడర్.. పార్టీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఆ పార్టీకి వీరవిధేయుడిగా పేరుతెచ్చుకున్నారు. అంతేకాదు ఆనాటి నేతలతో నుంచి నేటి యువ నాయకత్వం వరకు పార్టీ కోసం పని చేస్తునే ఉన్నారు. 73 ఏళ్ల వయసు పైబడిన ఆయన మాటలో, నడతలో ఆ విషయం అస్సలు కనిపించదు. ఎప్పుడు జోష్ గానే కనిపిస్తారు, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా స్పందిస్తుంటారు. అదే ‘‘ఏంరా బాబు’’ అనే డైలాగ్ గుర్తుకొస్తే ఆయనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హన్మంతరావు (వీహెచ్). కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్, బీసీ సమాజికవర్గం నుంచి బలమైన నేతగా ఉన్న హన్మంతరావు ఎప్పుడు చలాకీ ఉంటూ.. అన్ని విషయాలపై స్పందిస్తుంటారు. ఇందిరా హయం నుంచి రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్ ఇలా మూడు తరాల అధినాయకత్వంతో పనిచేస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే వీహెచ్‌కు అంత పిచ్చి. వయసు సహకరించకపోయినా ప్రతీ కార్యక్రమంలోనూ సామాజిక సమస్యలపైన కూడా తనదైన పంథాలో స్పందింస్తుంటారు.

మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాద ఘటనలో బిపిన్ రావత్‌తో పాటు ఏపీకి చెందిన సాయి తేజ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం వీహెచ్‌ను కలచివేసింది. అంతే సాయి తేజ కుటుంబీకులను కలిసి రామర్శించారు. బిపిన్ రావత్ లాంటి వ్యక్తి దగ్గర సాయి తేజ పనిచేయడం తెలుగు వారికి గర్వకారణమన్నారు. సాయితేజ్ కుటుంబంలోనే దేశభక్తి ఉందన్నారు. సాయి తేజ కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారంతో పాటు అతని భార్యకు గెజిటెడ్ ఉద్యోగం కల్పించాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు. ఇప్పుడు అనే కాదు ఎక్కడ సమస్యయ లోపం ఉంటే అక్కడ ప్రత్యక్షమౌతారు.. ఎంత దూరం అయిన వెళ్లాల్సిందే అంటారు కాంగ్రెస్ హనుమంతుడు. కాంగ్రెస్‌లో గొడవలు సహజం అందులో ఈ హనుమంతుడి పాత్ర కూడా తనదే. ఒకవైపు తమ నాయకులపైనే హాట్ కామెంట్స్ చేస్తూనే.. మరో వైపు సమస్య కనిబడితే దాని పరిష్కారిని అందరికంటే ముందు వెళ్తారు.

మొండి పట్టుదలతో ఉండే వీహెచ్ పంజాగుట్టలో బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిష్టించాలని రెండు మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. పార్టీలు, నేతలు ఎవరూ కలిసి రాకపోయిన అనుకున్న లక్ష్యం కోసం వీహెచ్ ఈ వయసులో కూడా ఒంటరిపోరు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లంతా అప్పట్లో హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు నచ్చకపోతే సొంత పార్టీ నేతలపై కామెంట్ చేస్తారు వీహెచ్. అలాగని వారితో దూరంగా ఉండరు. అవసరమైతే వారితోనే కలిసి పనిచేసేందుకు ముందడుగు వేస్తారు. అందుకే.. రాజకీయాల్లో వీహెచ్ రూటే సపరేటు అంటుంటారు రాజకీయ నేతలు.

అశోక్ భీమనపల్లి, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్

Also Read:

Heartwarming Video: పంది పిల్లలకు పాలిచ్చి.. మాతృత్వం చాటుకున్న శునకం.. వీడియో..

Shocking Video: పెళ్లి ఊరేగింపులో షాకింగ్ ఘటన.. ప్రాణ భయంతో పరుగులు తీసిన బంధువులు.. అసలేమైందంటే..?