Telangana Congress: పార్లమెంట్(Parliament) వేదికగా తెలంగాణ(Telangana) ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi) చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. పీఎం వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అయితే మరింత స్వరం పెంచి ప్రధానిపై విరుచుకుపడుతున్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు.. కాంగ్రెస్‌పై నెపం వేస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడిన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ప్రధాని మోదీ తీరును తూర్పారబట్టారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీది అని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ చరిత్ర మోదీ తెలుసుకోవాలని చురకలంటించారు జీవన్ రెడ్డి. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ప్రధాని మోదీ.. ఎనిమిదేళ్లుగా ఏపీ, తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.
పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభవాలను కించపరిచే విధంగా మోదీ మాట్లాడారంటూ నిప్పులు చెరిగారు జీవన్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో హిజాబ్ వివాదంపైనా తనదైన శైలిలో స్పందించారు జీవన్ రెడ్డి. ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రచ్చ చేస్తున్నారని బీజేపీ తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అనవాయితీకి భంగం కలిగించే విధంగా హిజాబ్ అంశాన్ని తెరమిదికి తెచ్చింది బీజేపీ అంటూ దుమ్మెత్తిపోశారు. దేశ ప్రజలను మభ్యపెడుతూ.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also read:
Chintamani Natakam: చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు జారీ..
Andhra Pradesh: నిప్పుల గుండం తొక్కేందుకు మహిళా భక్తుల పోటీ.. ఎందుకంటే..?
\Viral Video: అయ్యో నా కోడి అప్పుడే విడిచెల్లావా!.. ఎక్కిఎక్కి ఏడ్చిన వ్యక్తి..!