CM Kcr Press Meet: ఇకనైనా బుద్ధి మార్చుకోండి.. ప్రధానిపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..

CM Kcr Press Meet: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చండ్రనిప్పులు కక్కారు. దేశంలో త్వరలో ఏకస్వామ్య పార్టీనే ఉంటుందని..

CM Kcr Press Meet: ఇకనైనా బుద్ధి మార్చుకోండి.. ప్రధానిపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..
telangana cm kcr
Follow us

|

Updated on: Aug 06, 2022 | 5:13 PM

CM Kcr Press Meet: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చండ్రనిప్పులు కక్కారు. దేశంలో త్వరలో ఏకస్వామ్య పార్టీనే ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారని, ఇదేనా మీ ఫెడరలిజం అంటూ తూర్పారబట్టారు. ఇదేనా టీమ్ ఇండియా, ఇదేనా సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని, రేపటి రోజున ఇవే మిమ్మల్ని కబళిస్తాయని బీజేపీని హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారా? తమాషాగా ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. దేశ చరిత్రను మలినం చేస్తున్నారని, మహాత్మా గాంధీకి లేని అవలక్షణాలను అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని హితవుచెప్పారు.

ఎన్డీయేలో ఎన్‌పీఏ దందా..

ఎన్డీయే పాలనలో ఎన్పీఏ ల కుంభకోణం నడుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలోనే ఇది పెద్ద కుంభకోణం అని అన్నారు. ‘ఉచిత పథకాలు బంద్ చేయాలట.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఉచితమా? పాలపై, శ్మశానంపై పన్ను వేస్తారా? రైతులు బాధల్లో ఉన్నారని రైతుబంధు ఇస్తే తప్పా? ఉచితాలు తప్పు అయితే, ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు? ఎన్‌పీఏల పేరుతో బిగ్ స్కామ్ నడుస్తోంది. 2004-05 నాటికి ఎన్‌పిఏ లు రూ. 58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు ఎన్‌పిఏ లు రూ. 20.07 లక్షల కోట్లు ఉంది. బ్యాంక్ రుణాల ఎగవేతలు రూ. లక్షల కోట్లు. కమీషన్లు తీసుకుని ఎన్‌పిఏ లు ప్రకటిస్తున్నారు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ఇవి కూడా చదవండి

చైనా నుంచి తెప్పించడం మేకిన్ ఇండియానా?

మాంజా, బ్లేడ్లు, నెయిల్ కట్టర్లు, జాతీయ జెండాలు సైతం చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అంటే. దిగుమతులన్నీ చైనా నుంచి రావడమే మేకిన్ ఇండియానా? అని కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..