కొండపోచమ్మకు సీఎం కేసీఆర్ పూజలు

కొండపోచమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గోమాతను పూజించి… పూలమాల వేసి, అరటిపండు తినిపించారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదం సీఎం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అంతకు ముందు కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొండ పోచమ్మ ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈ పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో […]

  • Sanjay Kasula
  • Publish Date - 9:10 am, Fri, 29 May 20
కొండపోచమ్మకు సీఎం కేసీఆర్ పూజలు

కొండపోచమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గోమాతను పూజించి… పూలమాల వేసి, అరటిపండు తినిపించారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదం సీఎం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

అంతకు ముందు కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొండ పోచమ్మ ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈ పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పోచమ్మ దేవాలయంలో ఈ చండీయాగం నిర్వహంచారు .