CM KCR: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌నకు సీఎం కేసీఆర్​..

సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. బేగంపేట నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

CM KCR: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. జాతీయ స్థాయి ప‌ర్య‌ట‌నకు సీఎం కేసీఆర్​..
Cm Kcr
Follow us

|

Updated on: May 20, 2022 | 5:09 PM

ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. బేగంపేట నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చిస్తారు. జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో తన పర్యటన వివరాలను పంచుకుంటారు. అయితే.. ప్రధానంగా సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన ఢిల్లీ నుంచి మొదలవుతుంది. ముందుగా ఈ నెల 22వ తేదీన ఛండీగఢ్‌కు వెళ్తారు. అక్కడ జాతీయ రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెకులను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి పాల్గొంటారు. సుమారు 4 రోజులపాటు సీఎం కేసీఆర్‌ చండీగఢ్‌లో పర్యటించనున్నారు.

అక్కడి నుంచ నేరుగా 26న బెంగళూరుకు చేరుకుంటారు సీఎం కేసీఆర్‌.  మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 27న బెంగళూరు నుంచి రాలేగావ్‌ సిద్దికి వెళ్తారు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు.

అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకొని.. తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. 29 లేదా 30వ తేదీన.. బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసీఆర్‌ సంసిద్ధం కానున్నారు. గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను సాయం చేస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం…

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో