CM KCR: తెలంగాణ సర్కార్‌ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం.. ఒకే రోజు, ఒకే సారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా తరగతులకు శ్రీకారం

తెలంగాణ సర్కార్‌ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు, ఒకే సారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా తరగతులు ప్రారంభించబోతోంది. సీఎం కేసీఆర్‌ ఇవాళ ఆన్‌లైన్‌లో స్వీచ్‌ ఆన్‌ చేస్తారు.

CM KCR: తెలంగాణ సర్కార్‌ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం.. ఒకే రోజు, ఒకే సారి 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా తరగతులకు శ్రీకారం
CM KCR
Follow us

|

Updated on: Nov 14, 2022 | 9:54 PM

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కలకల ప్రాజెక్ట్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో నాలుగంటే నాలుగే ప్రభుత్వ కాలేజీలున్నాయి. సీట్లు కూడా వెయ్యి లోపే ఉన్నాయి. అలాంటిది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత జిల్లా ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే మహబూబ్‌నగర్‌, సిద్దిపేట్‌ జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు రన్‌ అవుతున్నాయి. ఒక కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ పలు కాలేజీలు ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. అన్ని అనుమతులు పూర్తయి.. మొదటి సంవత్సరం బ్యాచ్‌ విద్యార్థుల కౌన్సిలింగ్‌ కూడా పూర్తయింది. వాటిల్లో క్లాసులను అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్ లైన్లో ఒకేసారి 8 కాలేజీల్లో క్లాస్‌లను ప్రారంభించనున్నారు. తద్వారా.. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం..పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.

ఈ కాలేజీల్లో అన్ని రకాల వసతులు కల్పించారు. విద్యార్థులకు అధునాతన సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ నిధుల లోటు రానివ్వకుండా చర్యలు తీసుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం