సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి గల్లంతు

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2019 | 7:00 AM

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ అంకుర్‌ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది గల్లంతయ్యారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్, ఎస్పీ భాస్కరన్‌, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని […]

సాగర్‌ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి గల్లంతు
Follow us on

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్‌ ఎడమ కాల్వలో స్కార్పియో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌ అంకుర్‌ ఆస్పత్రికి చెందిన ఆరుగురు సిబ్బంది గల్లంతయ్యారు. వీరంతా చాకిరాలలో తమ సహోద్యోగి విమలకొండ మహేష్ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్, ఎస్పీ భాస్కరన్‌, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌, కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.  సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం గల్లంతైన వారి వివరాలు:
1. అబ్దుల్ అజీద్
2. రాజేష్
3. జాన్సన్
4. సంతోష్ కుమార్
5. నగేష్
6. పవన్ కుమార్

వాహనం నెంబర్:   (ఏపీ31 బిపి 338)