Telangana: ముగిసిన బీఆర్ఎస్ కీలక సమావేశం.. వారిపై అవిశ్వాసం తెలిపేందుకు సిద్దం..

బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకా, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో GHMC కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Telangana: ముగిసిన బీఆర్ఎస్ కీలక సమావేశం.. వారిపై అవిశ్వాసం తెలిపేందుకు సిద్దం..
KTR
Follow us

|

Updated on: Jul 05, 2024 | 1:48 PM

బీఆర్‌ఎస్‌ కీలక సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్‌ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్‌రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకా, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో GHMC కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీటింగ్‌కు మొత్తం 35మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేపటి GHMC కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశించింది.

పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలకాలని కౌన్సిల్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్ డిమాండ్‌ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్‌తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉంటే ఇప్పటికే మేయర్‌, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువాతీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఇవాళ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్వహించిన ఈ సమావేశం కీలకంగా మారింది. ఎవరు హాజరవుతారు? ఎవరు హాజరు కావడం లేదనే ఉత్కంఠకు తెరపడింది. ఈ కీలక సమావేశంలో ఐదు మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం తీవ్రచర్చకు దారితీసింది. వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవీ విడిది చేసిన ఆనవాళ్లు
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
తనను జైళ్లో పెట్టాలన్న డాక్టర్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన సమంత.!
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
తన ఊరి కోసం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబోస్‌.!
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
'డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు'.. సమంత పై సీరియస్.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
సాయంలో తండ్రిని మించేస్తున్న తనయుడు.! డ్యాన్సర్స్‌కు చెర్రీ సాయం.
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
కల్కి 2లో ప్రభాస్‌ ఎలా కనిపించబోతున్నాడో చెప్పిన నాగి.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!
అన్నయ్య అప్పు తీర్చడానికి రిస్క్‌ తీసుకున్న పవర్ స్టార్.!