MLA Rohith Reddy: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై..

ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని పశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు రోహిత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని..

MLA Rohith Reddy: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై..
MLA Rohith Reddy
Follow us

|

Updated on: Dec 27, 2022 | 7:37 AM

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై సస్సెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని పశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు రోహిత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆయన.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు.

మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్‌ను ఇప్పటికే విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. A2గా ఉన్న నందకుమార్‌ను ఇవాళ కూడా ప్రశ్నించనుంది ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నందకుమార్ నుంచి ఇప్పటికే స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈడీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..! తనను దోషిగా చూపేందుకు మాస్టర్ ప్లాన్ వేశారన్నది ఆయన వర్షన్.

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది ఈడీ. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..! మరి రేపు రోహిత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది..? ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నందకుమార్ మరో ఆరోపణ

ఇదిలావుంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ మరోసారి నందకుమార్‌ని ఈడీ విచారించనుంది. సోమవారం చంచల్‌గూడ జైలులో 4గంటల పాటు నందు విచారణ సాగింది. విచారణలో నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ.. ఇవాళ మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. ఇవాళ విచారణ అనంతరం కోర్టులో నివేదిక సమర్పించనుంది ఈడీ. నందుపై ఉన్న కేసుల వివరాలు సేకరించగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది.

బంజారాహిల్స్​లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో