Telangana: బీఆర్ఎస్‎కు ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ ఖాతాలో ఆ చైర్మన్ పదవి..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోవడంతోపాటు డీసీసీబీ చైర్మన్ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు అన్నారు.

Telangana: బీఆర్ఎస్‎కు ఊహించని దెబ్బ.. కాంగ్రెస్ ఖాతాలో ఆ చైర్మన్ పదవి..
Nalgonda Dccb Chairman
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 28, 2024 | 8:03 PM

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్‌ గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోవడంతోపాటు డీసీసీబీ చైర్మన్ వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న కాంగ్రెస్.. డీసీసీబీ పీఠంపై కన్నేసింది. 2021 ఫిబ్రవరిలో జరిగిన నసహకార సంఘాల ఎన్నికల్లో గెలిచి ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార బ్యాంకు (డిసిసిబి) ఛైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్‎గా గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.

డీసీసీబీలో మొత్తం 21 మంది డైరెక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 19 మందే ఉన్నారు. రిజర్వేషన్ల సభ్యులు లేకపోవడంతో మరో ఇద్దరిని నామినేట్ చేయలేదు. 19 మంది డైరెక్టర్లలో 18 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్. ఈ పదవిని తన అనుచరుడికి కట్టబెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 9 మంది డిసిసిబి డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీని తన ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదిపింది. దీంతో ఈనెల 10వ తేదీన చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి 14 మంది డైరెక్టర్లు నోటీసులు ఇచ్చారు.

నెగ్గిన విశ్వాస తీర్మానం..

డీసీసీబీ చైర్మన్ పదవిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆశిస్తున్నారు. 19 మందిలో 15 మంది డైరెక్టర్ల మద్దతు కూడగట్టిన శ్రీనివాస్ రెడ్డి క్యాంపుకు తీసుకెళ్లారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. 14 మంది డైరెక్టర్లు క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‎కు చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు బిఆర్ఎస్ డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాలేదు. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా పదిమంది కాంగ్రెస్ డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్‎కు చెందిన ఐదుగురు డైరెక్టర్లు కూడా మద్దతు ఇచ్చారు. దీంతో చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆయన డీసీసీబీ చైర్మన్ పదవిని కోల్పోయారు. చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో తాత్కాలిక చైర్మన్‎గా బాధ్యతలను వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి చేపట్టారు.

జూలై 1న నూతన చైర్మన్ ఎన్నిక..

డీసీసీబీ నూతన చైర్మన్ ఎన్నికను జూన్ 1న నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో ఉన్నారు. కుంభం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో 15 మంది డైరెక్టర్లను 17 రోజులుగా క్యాంపు నిర్వహించి నేరుగా ఓటింగ్ పిలుచుకుని వచ్చారు. జూలై 1న జరిగే ఎన్నికలో కుంభం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్‎గా ఎన్నిక లాంచనం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో నల్లగొండ డీసీసీబీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..