Telangana: కాంగ్రెస్‎లోకి చేరికల జోరు.. బీఆర్ఎస్ బాస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది కారు దిగతారు? కేసీఆర్‌కి హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇంకెంతమంది ఉన్నారు? బీఆర్ఎస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ ప్లాన్‌కు కేసీఆర్ దగ్గరున్న విరుగుడు వ్యూహం ఏమిటి? తెలంగాణ పాలిటిక్స్‌లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగా ఇబ్బందిపడుతూ వస్తున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యం తరువాత మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Telangana: కాంగ్రెస్‎లోకి చేరికల జోరు.. బీఆర్ఎస్ బాస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి..
BRS Party
Follow us

|

Updated on: Jun 30, 2024 | 7:46 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది కారు దిగతారు? కేసీఆర్‌కి హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇంకెంతమంది ఉన్నారు? బీఆర్ఎస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? కాంగ్రెస్ ప్లాన్‌కు కేసీఆర్ దగ్గరున్న విరుగుడు వ్యూహం ఏమిటి? తెలంగాణ పాలిటిక్స్‌లో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగా ఇబ్బందిపడుతూ వస్తున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యం తరువాత మరింత ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత కొన్ని రోజులుగా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటం రాజకీయంగా కారు పార్టీని కుదిపేస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ.. పార్టీ మారొద్దని సూచిస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే వారికి భరోసా ఇస్తున్నారు.

బీఆర్ఎస్ నాయకత్వం ఇంతలా ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో పార్టీ మారే ఎమ్మెల్యేలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు కేసీఆర్. అయితే కాంగ్రెస్ చెబుతున్నట్టుగా బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలంటే మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారు.. ఎవరెవరు గతంలో సీఎంతో భేటీ అయ్యారు.. అని లెక్కలు వేస్తోంది బీఆర్ఎస్. గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతోంది కాంగ్రెస్. ఈ సమాచారం బీఆర్ఎస్ దగ్గర కూడా ఉంది. దీంతోపాటు గతంలో రేవంత్‌తో పని చేసిన ఎమ్మెల్యేలు, ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని కారు పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

అయితే ఎలాగైనా బీఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం అయ్యే పరిస్థితి రానివ్వకూడదని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. మరో 20 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటే తప్ప బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశం ఉండదు. ఈలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దీంతోపాటుగా అనేక అంశాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని పార్టీ భావిస్తోంది. దీంతో ప్రభుత్వం మీద పెన్షన్లు, రైతు భరోసా, వడ్లకు బోనస్ ఇలాంటి అంశాలపై ఒత్తిడి తెస్తే పార్టీ నుంచి చేరికలు కూడా ఆగిపోతాయని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబం నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావుతో పాటు మొదటినుంచి ఉద్యమంలో, పార్టీలో కొనసాగిన పద్మారావు, ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. వీరితో పాటు పార్టీ కమిటెడ్‌గా పార్టీలో కొనసాగే వాళ్లు మరికొందరు ఉన్నారని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏది ఏమైనా 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే అవకాశం లేదని గులాబీ పార్టీ భావిస్తోంది. అదే జరిగితే బీఆర్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం సాధ్యంకాదు. వచ్చే ఎన్నికల వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనైతికంగానే కొనసాగాల్సి వస్తుంది. దీనిపై కోర్టులో కేసులు.. స్పీకర్ వద్ద ఫిర్యాదులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ రకమైన వ్యూహంతో ఫిరాయింపులను కట్టడి చేయడంతో పాటు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అబ్బాస్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..?
అబ్బాస్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..?
మీ కాళ్ళలో నొప్పి ఉంటుందా..? ఇది ఈ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత
మీ కాళ్ళలో నొప్పి ఉంటుందా..? ఇది ఈ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత
10th తర్వాత ఈ నైపుణ్య కోర్సులు చేశారంటే.. ఉజ్వల భవిష్యత్తు మీదే!
10th తర్వాత ఈ నైపుణ్య కోర్సులు చేశారంటే.. ఉజ్వల భవిష్యత్తు మీదే!
మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..
మొబైల్ యూజర్లకు బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ధరలు పెరిగినా..
గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. వెల్లుల్లితో ఇలా చేస్తే..
గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. వెల్లుల్లితో ఇలా చేస్తే..
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌..ధరలు తగ్గనున్నాయా?
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
ఇంట్లో గొడవలకు ఈ వాస్తు తప్పులే కారణం.. వెంటనే చెక్ చేసుకోండి..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
పవన్ నటించిన ఒకే ఒక్క యాడ్.. రెమ్యునరేషన్ ఏంతంటే..
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
నోట్లో కత్తి.. ముఖం నిండా నెత్తురు.. కాళీ మాతలా ఆర్జీవీ హీరోయిన్
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'
'NEET PG నిర్వహణకు 2 గంటల ముందు మాత్రమే ప్రశ్నాపత్రం సిద్ధం'