Telangana: ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.!

అతడు ఒకప్పుడు హోంగార్డ్.. వివాహేతర సంబంధం, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అడ్డదారుల్లోకి వెళ్ళాడు. దొంగగా మారాడు. ఏకంగా 36 కేసులలో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ హోంగార్డ్..? దొంగగా ఎలా మారాడు?

Telangana: ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.!
Thief Arrest
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 02, 2024 | 4:40 PM

అతడు ఒకప్పుడు హోంగార్డ్.. వివాహేతర సంబంధం, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అడ్డదారుల్లోకి వెళ్ళాడు. దొంగగా మారాడు. ఏకంగా 36 కేసులలో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ హోంగార్డ్..? దొంగగా ఎలా మారాడు? అన్నదీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

రాజస్థాన్ కు చెందిన మహేందర్ సింగ్ సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో హోంగార్డ్‌గా పనిచేశాడు. అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో చెడు అలవాట్లకు బానిస అయిన హోంగార్డు అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే 2012 నుండి 2015 వరకు వరుస చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు ఇప్పటివరకు బాచుపల్లి, కేపీహెచ్‌బీ, సనత్ నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మహేందర్ సింగ్ పై పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు పోలీసులు.

నిందితుడు మహేందర్ సింగ్ పై పీడీ యాక్ట్ పెట్టిన అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. తాజాగా జూన్ నెల 24న బాచుపల్లిలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగలించాడు. అనంతరం జీడిమెట్ల, జగద్గిరిగుట్ట లోను మరో ఇద్దరి మహిళల నుంచి బంగారు గొలుసులను దొంగలించాడు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మహేందర్ సింగ్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నిందితుడు మహేందర్ సింగ్ నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారంతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!
'బేబీ నాగులపల్లి కమింగ్'.. శుభవార్త చెప్పిన 'బ్రహ్మముడి' మానస్
'బేబీ నాగులపల్లి కమింగ్'.. శుభవార్త చెప్పిన 'బ్రహ్మముడి' మానస్
మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చు పెట్టిన బూడిద..!
మంత్రి, ఎమ్మెల్యే మధ్య చిచ్చు పెట్టిన బూడిద..!
లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ధర చాలా తక్కువ..
లావా నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ ఫోన్‌.. ధర చాలా తక్కువ..