Ponnam v/s Koushik: మంత్రి, ఎమ్మెల్యే మధ్య ముదురుతున్న విభేధాలు.. ఏకంగా పోలీసు కేసులే..!

ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, కానీ రాజకీయంగా వేడి‌ మాత్రం పెరుగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తయ్యారైంది. అవినీతి ఆరోపణలు నుంచి మొదలుకుని జెడ్పీలో జరిగిన‌ సమావేశంలో వరకు విమర్శలు, ప్రతి విమర్శలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య ఎందుగింత విభేధాలు..?

Ponnam v/s Koushik: మంత్రి, ఎమ్మెల్యే మధ్య ముదురుతున్న విభేధాలు.. ఏకంగా పోలీసు కేసులే..!
Ponnam Vs Kaushik
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 04, 2024 | 6:30 PM

ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు, కానీ రాజకీయంగా వేడి‌ మాత్రం పెరుగుతోంది. రెండు పార్టీల నేతల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తయ్యారైంది. అవినీతి ఆరోపణలు నుంచి మొదలుకుని జెడ్పీలో జరిగిన‌ సమావేశంలో వరకు విమర్శలు, ప్రతి విమర్శలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల మధ్య ఎందుగింత విభేధాలు..? అంతలా రాజకీయం వేడేక్కిందో తెలుసుకుందాం..!

కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ‌కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతుంది. రెండు నెలలు నుండి జరుగుతున్న ఈ ఆరోపణలు చివరికి కేసుల వరకి వెళ్ళాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పైనా ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ రవాణాలో అవినీతి జరిగందంటూ ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ పొన్నం ప్రభాకర్ పైనా ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. అయితే ప్రబాకర్ ఈ అవినీతి అరోపణలపైనా ఎక్కడ స్పందించకుండా కాంగ్రెస్ నేతలు కౌశిక్‌కు కౌంటర్ ఇచ్చారు. కౌషికే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు అరోపించారు.

దీంతో తాను ఎలాంటి అవినీతి కి పాల్పడలేదని కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా చెల్పూర్ అంజనేయస్వామి దేవస్థానంలో ప్రమాణం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఈ నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క రోజంతా హడావుడి నడిచింది. పోలీసుల ఆంక్షల కారణంగా కౌశిక్ తన ఇంట్లోనే దేవుడుపైనా ప్రమాణం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక్కడ కూడా మరోసారి పొన్నం అవినీతిపైనా ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి.

ఇదిలావుంటే, మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో తాను ఏంఈవోలతో సమావేశం నిర్వహించిన కారణంగా వారికి నోటీసులు ఇవ్వడం అన్యాయం అంటూ కౌన్సిల్ హాల్‌లో బైఠాయించారు కౌశిక్ రెడ్డి. అంతే కాకుండా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులపైనా అగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేదిక ముందు కలెక్టర్‌ను అడ్డుకుని నిలదీశారు. డీఈవోను సస్పెండ్ చేయాలంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే విధులకు ఆటంకం కలిగించారంటూ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పోలిసులకు ఫిర్యాదు చెశారు. దీంతో పోలిసులు కేసు చేశారు. తరువాత కౌశిక్ జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పైనా పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన మీద అక్రమ కేసులు పెట్టించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర ఉందంటూ మరోసారి విమర్శలు గుప్పించారు కౌశిక్ రెడ్డి.

మొత్తానికి ఈ ఇద్దరూ నేతల మధ్య రాజకీయం కొనసాగుతుంది. కౌశిక్ మాత్రం తగ్గేదీ లేదంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ‌కౌశిక్ నటనకు తగిన మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
వావ్‌.! 800 కోట్ల కల్కి|గ్రేట్‌.! కల్కీ విషయంలో తప్పులపై నాగి.
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!