Telangana: కేబినెట్‌ విస్తరణకు సర్కార్ ఏర్పాట్లు.. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌.. లిస్టులో ఉన్నదెవరంటే..?

తెలంగాణ లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణ లో ఎవరికి అవకాశం దక్కనుంది. విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్‌ చేసిన సూచనలు ఏంటి..?

Telangana: కేబినెట్‌ విస్తరణకు సర్కార్ ఏర్పాట్లు.. రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌.. లిస్టులో ఉన్నదెవరంటే..?
Revanth Reddy Cabinet
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 02, 2024 | 3:39 PM

తెలంగాణ లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణ లో ఎవరికి అవకాశం దక్కనుంది. విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్‌ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్‌ చేసిన సూచనలు ఏంటి..? ఇటీవల పార్టీ మారినవారికి చోటు కల్పిస్తారా..? అనేదే ఆసక్తికరంగా మారింది.

ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎంతో కలుపుకుని 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ చేయనున్నారు. ఢిల్లీలో ఐదు రోజుల పాటు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్‌తో సంప్రదింపుల అనంతరం కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి ఆశావాహులు అంతా అటు ఢిల్లీ ఇటు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అయితే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రస్తుత కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించలేదు. కేబినెట్ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరి అవకాశం కల్పించాల్సి పరిస్థితి.

మంత్రి పదవుల కోసం భారీ పోటీ..!

ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉండడం వినోద్‌కు ప్లస్ పాయింట్ అయితే, వివేక్ ఇతర పార్టీలకు వెళ్లి రావడం మైనస్‌గా భావిస్తున్నారట. గతంలో ఎమ్మెల్సీ, ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు తనకు మంత్రి పదవి ఖాయం అని భావిస్తున్నారు. ఇక ఎస్టీ కోటాలో ఎడ్మ బోజ్జా పేరు సైతం వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు. ఆయనకు దాదాపు మంత్రి పదవి ఖాయం అనే పార్టీలో టాక్. మైనారిటీ కోటాలో మరో నేత షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. పీసీసీ పదవి ఆశిస్తున్న ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తనకు పీసీసీ కాకుంటే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారట.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్‌గా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి ఒకే సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సమస్యగా మారింది. ఇక ఎస్టీ కోటాలో బాలు నాయక్ కు మంత్రి పదవి కన్ఫర్మ్ అని తెలుస్తోంది. బీసీ కోటాలో ముఖ్యంగా యాదవ కోటాలో మంత్రి పదవి లిస్ట్ లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు అవకాశం ఉందని సమాచారం.

హైద్రాబాద్‌లో ఎవరికో..?

ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ ఒక్కరే కాంగ్రెస్ కు ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే బీసీ కోటాలో దానంకు అవకాశం దక్కేలా ఉంది. మరో యువనేత బల్మూరి వెంకట్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మరో నేత పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రుల లిస్ట్ లో ఉన్నారు.

ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో జీవన్ రెడ్డి అసంతృప్తి గా ఉన్నారు. దీంతో జీవన్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా ఉంది. బీసీ కోటా లో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్ కేబినెట్‌లో అవకాశం ఇస్తామని సీఎం చెప్పడంతో శ్రీహరికి మంత్రి పదవి ఖాయం అనే చర్చ పార్టీలో ఉంది.

మొత్తం గా పూర్తిస్థాయి కేబినెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తి అయినట్లే తెలుస్తోంది. చాలా మంది పేర్లు పరిశీలన లో ఉన్నా, చివరి నిమిషం వరకు గోప్యత పాటించాలని డిసైడ్ అయ్యారట.దీంతో తమకు మంత్రి పదవి వస్తుందో రాదో అన్న టెన్షన్ అందరిలో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
అంజీర్ ఏ సమయంలో తింటే బెటర్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
అంజీర్ ఏ సమయంలో తింటే బెటర్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో
మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో
ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!
ఈ లక్షణాలు కనిపిస్తుంటే శరీరంలో షుగర్‌ పెరుగుతుందని అర్థం!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. ఓపెన్ చేయగా
ఏసీ భోగి వద్ద అనుమానాస్పదంగా 4 బ్యాగులు.. ఓపెన్ చేయగా
గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. ఇవి గుర్తు పెట్టుకోండి..
గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మకండి.. ఇవి గుర్తు పెట్టుకోండి..
'పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో!' నెటిజన్ల సంతాపం
'పని భారం తాళలేక.. ఆత్మహత్య చేసుకున్న రోబో!' నెటిజన్ల సంతాపం
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
ర్యాపిడ్‌ రైల్‌.. భూగర్భ మార్గాల్లో కొత్తగా 3 రైల్వే స్టేషన్లు!
ర్యాపిడ్‌ రైల్‌.. భూగర్భ మార్గాల్లో కొత్తగా 3 రైల్వే స్టేషన్లు!