Telangana: ఎన్నికల ప్రచార వ్యూహం మార్చిన బండి సంజయ్.. ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరంటే..?

బిజెపి నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రూట్ మార్చారు. మొన్నటి వరకు.. బీఆర్ఎస్‎ని టార్గెట్ చేసిన సంజయ్ ఇప్పుడు.. కాంగ్రెస్‎పై విమర్శలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమకి కాంగ్రెస్సే పోటీ అంటున్నారు. అయితే.. బీఆర్ఎస్ మూడవ స్థానంలో పరిమితమవుతుందని చెబుతున్నారు. ప్రతి సమావేశంలో కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు.

Telangana: ఎన్నికల ప్రచార వ్యూహం మార్చిన బండి సంజయ్.. ఇప్పుడు ఆయన టార్గెట్ ఎవరంటే..?
Bandi Sanjay
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 04, 2024 | 3:41 PM

బిజెపి నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రూట్ మార్చారు. మొన్నటి వరకు.. బీఆర్ఎస్‎ని టార్గెట్ చేసిన సంజయ్ ఇప్పుడు.. కాంగ్రెస్‎పై విమర్శలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమకి కాంగ్రెస్సే పోటీ అంటున్నారు. అయితే.. బీఆర్ఎస్ మూడవ స్థానంలో పరిమితమవుతుందని చెబుతున్నారు. ప్రతి సమావేశంలో కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే సంజయ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాహిత కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే.. ఈ వారం రోజుల నుంచి కాంగ్రెస్‎పైన విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. ఆరు గ్యారంటీలు గురించి మాట్లాడుతున్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. మరోసారి మోదీ ప్రధాని అవుతారని అంటున్నారు. ఇటీవల.. హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నంపై అనుచిత కామెంట్స్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తరువాత.. ఇప్పటికీ ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. అయితే సంజయ్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‎పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనం చేస్తే తమకే ఈ ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. దీంతో సంజయ్ మొత్తంగా కాంగ్రెస్‎ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఇక్కడ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ప్రాంతీయ, జాతీయ పార్టీలు. ఎప్పుడు బీఆర్ఎస్‎పై దూకుడుగా ఉండే సంజయ్ మాత్రం.. కాంగ్రెస్‎పై విమర్శలను పెంచారు. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాలేదు. ఇటీవల పొన్నం కూడా సంజయ్‎ని విమర్శించారు. మతం తప్పా ఎలాంటి అభివద్ధి చేయలేదని అంటున్నారు. అంతేకాదు మతం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని సెంటిమెంట్‎తో మరోసారి గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కానీ ఈసారి సెంటిమెంట్‎ను ప్రజలు పట్టించుకోరని చెబుతున్నారు. మొత్తానికి బిజెపి, కాంగ్రెస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles