Bandi Sanjay: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు..

|

Jan 04, 2024 | 10:25 AM

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో 400ల స్థానాలు టార్గెట్ గా.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఉత్తరాదితోపాటు.. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2019లో నాలుగు స్థానాలను దక్కించుకున్న తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు సమాయత్తమవుతోంది..

Bandi Sanjay: బీజేపీ అధిష్టానం సంచలన నిర్ణయం.. బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు..
Bandi Sanjay
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో 400ల స్థానాలు టార్గెట్ గా.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాలతో ముందుకువెళ్తోంది. ఉత్తరాదితోపాటు.. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2019లో నాలుగు స్థానాలను దక్కించుకున్న తెలంగాణలో కూడా ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు సమాయత్తమవుతోంది.. ఈ క్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. బండి సంజయ్ ను కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియమించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ బీజేపీ అధిష్టానం ప్రకటనను విడుదల చేసింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది. ఇందులో పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సల్‌, తరుణ్ చుగ్ సహా పలువురికి కీలక బాధ్యతలను బీజేపీ హైకమాండ్ అప్పగించింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు మొత్తం 7 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జిలను నియమిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌పాండాను నియమించారు. కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా బండి సంజయ్ ను నియమించింది. దీంతోపాటు యువ మోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్‌ బన్సల్‌, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్‌ చుగ్‌, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా రాధా మోహన్‌ దాస్‌ అగర్వాల్‌, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్‌ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుశ్యంత్‌ కుమార్‌ గౌతమ్‌లను నియమిస్తూ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు.

కాగా.. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ను గతంలో తెలంగాణ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పించిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.. ఆ తర్వాత ఇప్పుడు అధిష్టానం కీలకమైన కిసాన్‌మోర్చా ఇన్‌ఛార్జిగా నియమించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..