Telangana: జ్యోతిష్యం చెబుతానని వచ్చి మహిళకు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాడు.. కట్ చేస్తే

జ్యోతిష్కులు, దొంగ బాబాల గురించి ప్రతి సారీ హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినా సరే కొందరు వారి ట్రాప్‌లో పడుతూనే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన వెలుగుచూసింది.

Telangana: జ్యోతిష్యం చెబుతానని వచ్చి మహిళకు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లాడు.. కట్ చేస్తే
representative image
Follow us

|

Updated on: May 24, 2022 | 4:47 PM

సమాజంలో మోసాలు ఎక్కువైపోయాయి. అదేంటో తెలీదు కానీ రోజూ న్యూస్‌లో గుప్త నిధులు, రైస్ పుల్లింగ్, అతీత శక్తిలున్న విగ్రహాల పేరిట జరిగే మోసాలు గురించి  హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినా కానీ ఇంకా కొందరు మోసపోతూనే ఉన్నారు. ఉన్న సమస్యల్ని తొలగించుకోవడానికి దారులు వెతుకుతూ కేటుగాళ్లు ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ అమాయకపు మహిళను నిండా ముంచేశాడు ఓ జ్యోతిష్కుడు. నిజామాబాద్ జిల్లా( Nizamabad district) బోధన్ మండలం(Bodhan mandal) ఏరాజ్​పల్లి(Erajpally) గ్రామంలో జ్యోతిష్యుడి చేతివాటం వెలుగుచూసింది. ఏరాజ్​పల్లికి… నెల రోజుల క్రితం ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పడానికి వచ్చాడు. ఊరిలో ఒక ఇంట్లో జాతకం చెబుతున్న అతడిని చూసి.. అటుగా వెళ్తున్న ఓ మహిళ  పరిశీలించేందుకు అక్కడికి వెళ్లింది. ఆమెను చూసిన ఆ జ్యోతిష్కుడు ‘నీకు చాలా బాధలున్నాయ్ అమ్మా… జాతకం చెబుతాను’ అనగానే.. ఆ మహిళ అతడి మాయమాటలు నమ్మింది. ఇంటికి తీసుకెళ్లింది. జాతకం చెప్పిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే ఫోన్ చేయమని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఆ జ్యోతిష్కుడికి ఫోన్ చేసింది. దీంతో పరిస్థితిని అనువుగా మార్చుకుని ఆమెను బుట్టలో వేసుకున్నాడు. మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని నమ్మబలికాడు. వాటిని వెలికి తీయాలంటే పూజలు చేయాలని.. దానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆ నిధులు దొరికితే కోట్లు వస్తాయి.. కష్టాలు తీరుతాయి అనుకుందో ఏమో.. సదరు మహిాళ పెనివిటికి కూడా తెలియకుండా ఆ మాయగాడికి సుమారు రూ.4 లక్షల రూపాయలు గూగుల్ పే చేసింది. పూజలు చేశాక.. రోజులు గడుస్తున్నా ఆ గుప్తనిధుల జాడ కనిపించలేదు. జ్యోతిష్కుడికి ఫోన్ చేయగా కలవలేదు. చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్ చేసింది. జ్యోతిష్కుడిగా వచ్చిన ఆ ఘరానా మోసగాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..