Kalvakunta Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో కవిత సంచలనం.. ఓ మున్సిపాలిటీ కైవసం..

Telangana municipal election results: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె ఆల్​ ఇండియా ఫార్వార్డ్​ బ్లాక్​ పార్టీ నుంచి తన మద్దతుదారులను బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ...

Kalvakunta Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో కవిత సంచలనం.. ఓ మున్సిపాలిటీ కైవసం..
Kalvakunta Kavitha

Updated on: Feb 13, 2026 | 1:16 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సొంతం చేసుకుంది. ప్రధాన పార్టీలకు చెక్ పెడుతూ.. మొత్తం 10 వార్డులకు గాను ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.

AIFB నుంచి కవిత మద్దతుదారులు ఈ పుర ఎన్నికల్లో బరిలోకి దిగారు. 40 మున్సిపాలిటీల్లోని 212 వార్డుల్లో పోటీకి దిగారు. వడ్డేపల్లిలోని 10లో 8 వార్డుల్లో వీరు విజయం సాధించగా…  సుల్తానా బాద్‌లో ఒక వార్డులో విజయం దక్కింది. పెద్దపల్లిలో 1 వార్డు, మంథనిలో 1 వార్డు గెలుచుకున్నారు.
రామగుండంలో 10 వార్డుల్లో లీడ్ కొనసాగుతుండగా… ఆదిలాబాద్‌ లో 8 మంది ఫార్వడ్ బ్లాక్ అభ్యర్థులు లీడ్‌‌లో ఉన్నారు.  మంచిర్యాలలో 4 స్థానాల్లో ఫార్వాడ్ బ్లాక్ ఆధిక్యం కనబరుస్తుంది. ఒవరాల్‌గా 40 వార్డులు గెలుస్తామని.. ఫార్వడ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు చెబుతున్నారు.

వడ్డేపల్లి పీఠం కైవసం వెనుక.. కవిత పక్కా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బలమైన నేతగా పేరున్న  వడ్డేపల్లి శ్రీనన్న కొంతకాలం క్రితం ‘తెలంగాణ జాగృతి’లో చేరారు. ఆయన చేరికతో అక్కడ కవితకు మంచి ఫుస్ లభించినట్లు సమాచారం.

Loading...
Unable to load recommendations.
Follow Us