Allu Arjun: కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ఫ సినిమాకు ఉన్న క్రేజ్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌లను షేక్ చేసింది. అయితే అదంతా ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా?.. నిన్న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ నిర్వహించిన రజతోత్సవ సభలో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కేసీఆర్‌ సభలో పుష్ప ఫ్లెక్సీ ఏంటి అనుకుంటున్నారా.. అయితే తెలుసుకుందా పదండి..

Allu Arjun: కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
Pushpa

Updated on: Apr 28, 2025 | 3:38 PM

తెలంగాణలో బీఆర్‌ఎస్‌(అప్పట్లో టీఆర్ఎస్) పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రజతోత్సవ సభలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈ సభ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సభలో అల్లు అర్జున్, కేసీఆర్‌ ఉన్న ఫ్లెక్సీల‌ను ప్రదర్శిస్తూ సంద‌డి చేశారు. ఫ్లెక్సీలపై ఓ వైపు కేసీఆర్, మ‌రోవైపు బ‌న్నీ ఫొటోల‌లు వేయించి తగ్గేదే లే అని రాసుకొచ్చారు. “కేసీఆర్ అంటే పేరు కాదు.. కేసీఆర్ అంటే బ్రాండ్‌ అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను పట్టుకొని సభలో ప్రదర్శించారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీఆర్ఎస్‌ శ్రేణులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసి అల్లు అర్జున్ అభిమానులు అది మన హీరో క్రేజ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…