Aasara Pensions: ఆసరా పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ దరఖాస్తులకు గడువు పెంపు

|

Oct 10, 2021 | 10:28 AM

Aasara Pensions: పెన్షన్‌ దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని..

Aasara Pensions: ఆసరా పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ దరఖాస్తులకు గడువు పెంపు
Aasara Pensions
Follow us on

Aasara Pensions: పెన్షన్‌ దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని మీసేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేదని అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వారందరికీ పింఛన్లు అందుతాయని సీఎం కేసీఆర్ సభావేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్‌ సోమేష్ కుమార్.. దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ రూ.2,116 వృద్ధాప్య పెన్షన్ అందజేస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు. ఓటర్‌ కార్డు లేదా ఆధార్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. అలాగే దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ తీసుకునేందుకు అనర్హులు.డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!

PM Mudra Yojana: రూ.50 వేల రుణం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండిలా.. పూర్తి వివరాలు..!