Watch: ఇళ్ల మధ్యలో భారీ కొండచిలువ.. ఓ ఇంటి ఆవరణలో ఇలా నక్కి ఉండగా..

బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ ఇంట్లోని వారిని అప్రమత్తం చేశారు. కొండపై నుంచి కిందకు దూసుకొచ్చిన కొండచిలువను చూసిన స్థానికులు, ఆ ఇంటివారు భయంతో పరుగులు తీశారు.

Watch: ఇళ్ల మధ్యలో భారీ కొండచిలువ.. ఓ ఇంటి ఆవరణలో ఇలా నక్కి ఉండగా..
python

Updated on: Oct 22, 2024 | 8:50 AM

నిర్మల్ జిల్లా బాసర గణేష్ నగర్ కాలనీలో కొండచిలువ కలకలం రేపింది. ఒక ఇంటి ఆవరణలో కనిపించిన భారీ కొండచిలువ స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేసింది. బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ ఇంట్లోని వారిని అప్రమత్తం చేశారు. అటు పాములు పట్టుకునే ఫయాజ్‌కు సమాచారం అందించారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

కొండపై నుంచి కిందకు దూసుకొచ్చిన కొండచిలువను చూసిన స్థానికులు, ఆ ఇంటివారు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించాడు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణమున్న భారీ కొండచిలువను పట్టుకోవడం ఔరా అనిపించే విధంగా కాలనీవాసులు ఫయాజ్ ని అభినందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us