Viral Video: అలవోకగా వాగు దాటిన వృద్ధురాలు.. ఆమె వెనకే వెళ్లిన యువకుడు గల్లంతు! వీడియో వైరల్

యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద..

Viral Video: అలవోకగా వాగు దాటిన వృద్ధురాలు.. ఆమె వెనకే వెళ్లిన యువకుడు గల్లంతు! వీడియో వైరల్
Man Dies As Drowned Into Chinneti Vagu

Updated on: Sep 20, 2025 | 2:59 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి వాన ముంచెత్తింది. దాంతో మూసి నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉదృతి తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది.

ఆమె వెనకాలే 23 ఏళ్ల యువకుడు వరద ఉధృతిని దాటే ప్రయత్నం చేశాడు. సునాయాసంగా ఆమె వాగును దాటి వెళ్లగా… అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలై పోయాడు. వరద ఉదృతికి కొట్టుకుపోయాడు. ఇదంతా అక్కడ అందరూ చూస్తుండగానే జరిగిపోయింది. కళ్ళ ముందే యువకుడు కొట్టుకు పోతుంటే… కాపాడే సాహసం కూడా చేయలేకపోయారు స్థానికులు. దాంతో యువకుడు గల్లంతై పోయాడు. బాధితుడు హైద్రాబాద్ లోని నాచారం కు చెందిన గుండె నరేష్ గా గుర్తించారు. గల్లంతైన నరేష్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

ఇవి కూడా చదవండి

మరో ఘటన: చిన్నేటి వాగులో యువకుడు గల్లంతు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, నాచారానికి చెందిన దండు నరేశ్‌ (24) అనే యువకుడు బీబీన‌గ‌ర్‌ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారులో ఉన్న చిన్నేటి వాగు దాటుతున్న వృద్దురాలికి సహాయం చేసేందుకు వెళ్లిన దండు నరేశ్‌ (24) అనే యువకుడు మద్యంమత్తులో వాగులో పడి గల్లంతయ్యాడు. వరద ఉధృతి ఎక్కువవడంతో నీళ్లలో పడి వరద‌లో కొట్టుకుపోయాడు. దీంతో అతడి ఆచూకీ లభ్యం కాలేదు. సంఘటనా స్థలాన్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అవుషపూర్ అరోరా కళాశాలలో పని కోసం మిత్రుడు సాయితేజతో కలిసి వచ్చిన నరేష్ కొండమడుగు వద్ద మద్యం కొనుగోలు చేసి బీబీ నగర్‌లో మద్యం సేవించి చెన్నేటి వాగులో ఫొటోలు దిగేందుకు వెళ్ళినట్లు నరేష్ స్నేహితుడు సాయి తేజ తెలిపాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us