గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సెలబ్రెటీలు, సామాన్యులు సహా అనేక మంది అకాల మృత్యువాత పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హార్ట్ ఎటాక్ కు గురై మరణిస్తున్నవారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నిండా 20 ఏళ్ళు కూడా నిండని యువతీ యువకులు మాత్రమే కాదు.. చిన్న వయసులోనే ఉద్యోగస్తులు కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు 26 ఏళ్ల మురళి గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సినిమా థియేటర్ లో సినిమా చూస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. చికిత్సనిమిత్తం హుటాహుటిన ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడు ఖమ్మం జిల్లాలోని మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన మురళీ కృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చేతికి అందిన తనయుడు హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..