Breaking News
  • ఏపీ గవర్నర్‌కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థిక సాయాన్ని వైసీపీ దుర్వినియోగం చేస్తోంది. రూ.వెయ్యి, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించకుండా నగదు పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదు. రూ.వెయ్యి పంపిణీలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలా వాడుకుంటున్నారు. చట్టవ్యతిరేకంగా వ్యహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు.
  • ప.గో: ద్వారకాతిరుమలలో క్షుద్రపూజల కలకలం. చెరువువీధిలోని ఓ ఇంటి ఎదుట బొమ్మ, పసుపు, కుంకుమ.. ముగ్గు, నిమ్మకాయలతో చేతబడి చేసినట్టు అనుమానం. భయాందోళనలో గ్రామస్తులు.
  • తెలంగాణలో మర్కజ్‌ టెన్షన్‌. నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో.. ఇంకా పాజిటివ్‌ కేసులున్నాయని విచారిస్తున్న అధికారులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లను కలిసిన పలువురిని క్వారంటైన్‌కు తరలింపు. నిన్నటి వరకు మొదటి స్టేజ్‌గా నేరుగా మర్కజ్‌ వెళ్లొచ్చిన వారితో.. సంబంధాలు ఉన్నవారి శాంపిల్స్‌ తీసుకున్న వైద్య సిబ్బంది. ఈ రోజు నుంచి రెండో స్టేజ్‌ విచారణ. నిన్న శాంపిల్స్ తీసుకున్న వారు ఎవరెవరిని కలిశారో పోలీసుల విచారణ.
  • నిజామాబాద్‌: జిల్లాలో మరో కరోనా అనుమానిత వ్యక్తి మృతి. మోపాల్‌ మండలం కంజరలో హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి. గత నెల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తి. భయాందోళనలో గ్రామస్తులు.
  • వికారాబాద్‌ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు. మర్కజ్‌ వెళ్లొచ్చిన 18 మందిలో నలుగురికి పాజిటివ్‌. వికారాబాద్‌, మర్పల్లి, పరిగి, తాండూరు వాసులుగా గుర్తింపు. నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు. -వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారి దశరథ్‌. పరిగిలో హైఅలర్ట్‌ ప్రకటించిన పోలీసులు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిక. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌.

స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ?

telangana congress sleeping more, స్లీపింగ్ మోడ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌.. ఎవరెక్కడో తెలుసా ?

తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు. ఉన్న నేతలు సమావేశాలకు పరిమితమయ్యారు. దీంతో చలో ట్యాంక్‌బండ్‌లో కాంగ్రెస్‌ నేతలు కనిపించకుండా పోయారు. అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? కాయకల్ప చికిత్సకు అధిష్టానం ఎందుకు వెనక్కి తగ్గుతోంది ? పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు తెరమీదికొచ్చాయి.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సకలజనుల చలో ట్యాంక్‌బండ్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్షానికి చెందిన అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ట్యాంక్‌ బ్యాండ్‌ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రం ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. కాంగ్రెస్‌ నేతలు సైలెంట్‌ ఎందుకు అయ్యారు? కొందరైతే ఆర్టీసీ సమ్మె మీద ఎంతో కొంత హడావిడి చేసి.. అనాల్సిన నాలుగు మాటలు అనేసి.. చక్కగా అమెరికాకు చెక్కేశారని అనుకుంటున్నారు.

చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు విక్రమ్‌గౌడ్‌తో పాటు కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. పోలీసులు వీరిని అరెస్టు కూడా చేశారు. కానీ ఇతర కీలక నేతలు మాత్రం ఎవరూ కనీసం ట్యాంక్‌బండ్‌ వైపు కన్నెత్తి చూడలేదు. కొందరు హౌస్‌ అరెస్టులకు మాత్రమే పరిమితమయ్యారు. ఒకరిద్దరైతే పోలీసులను రప్పించుకుని మరీ హౌజ్ అరెస్ట్ పేరిట తాపీగా వుండిపోయారని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె ప్రారంభం నుంచి కాంగ్రెస్‌ నేతలు దూరంగానే ఉంటున్నారు. వీరు ఎందుకు బయటకు రావడం లేదనేది ఇప్పుడు గాంధీభవన్‌లో డిస్కషన్‌ పాయింట్‌ అయింది.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనకు పిలుపు ఇస్తే కాంగ్రెస్‌ నేతలు మొత్తం కదులుతున్నారు. ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఆందోళనకు పిలుపు ఇస్తే నేతలు గాంధీభవన్‌ దాటి రావడం లేదని తెలుస్తోంది. కేసీఆర్‌తో మిలాఖత్‌ రాజకీయంతోనే తమ నేతలు నిరసనల్లో పాల్గొనడం లేదని కొందరు గాంధీభవన్‌ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ నేతలు సైలెంట్‌ మోడ్‌ నుంచి ఎప్పుడూ బయటకు వస్తారో..ఎప్పుడూ సమరం ప్రకటిస్తారో అని కార్యకర్తలు వెయిటింగ్‌ చేస్తున్నారు.

Related Tags