youtube removed videos: ప్రముఖ వీడియో సైట్ యూట్యూబ్ తాజాగా తమ సైట్ నుంచి ఏకంగా 10 లక్షల వీడియోలను తొలగించింది. అయితే యూట్యూబ్ ఇలా వీడియోలను తొలగించడం ఇదే కొత్త కాదు. కొన్ని రోజులకోసారి యూట్యూబ్ వీడియోలను తొలగిస్తూనే ఉంటుంది. సాధారణంగా తప్పుడు సమాచరం ఉన్న, వ్యూస్ లేని వీడియోలను, యూట్యూబ్ నిబంధలను అతిక్రమించిన వీడియోలను తొలగిస్తూ ఉంటుంది. ఇది నిత్యం కొనసాగే ప్రక్రియే అయినప్పటికీ తాజాగా యూబ్యూట్ తొలగించిన వీడియోల్లో మాత్రం అత్యధికంగా కరోనాకు సంబంధించిన వీడియోలే ఉండడం గమనార్హం.
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోవడానికి జనాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే కరోనాను ఎలా తరిమికొట్టాలి, ఎలాంటి ఆహార పదార్థలు తీసుకోవాలి, కరోనా కారణంగా ఎంత మంది చనిపోయారు. ఇలా చాలా అంశాలపై యూట్యూబ్‌లో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే వీటిలో కొన్ని నిజమైన వార్తలు ఉంటే చాలా వరకు తప్పుడు సమాచారం ఉన్న వీడియోలు ఉన్నాయి. వీటినే గుర్తించిన యూట్యూబ్ వీడియోలను తొలగించింది. ఇలా ఏకంగా 10 లక్షల వీడియోలను డిలీట్ చేసినట్టు యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ నెల్ మోహన్ తెలిపారు. యూట్యూబ్‌లో వంద కోట్ల వీడియోల్లో తప్పుడు సమాచారం ఉన్న వీడియోల శాతం చాలా తక్కువగా ఉంటుందని, మొత్తం వ్యూస్‌లో కేవలం 16 నుంచి 18 శాతం మాత్రమే యూట్యూబ్ పాలసీలను ఉల్లంఘించే వీడియోలు ఉంటాయని మోహన్ తెలిపారు.
KCR Karimnagar Tour: నేడు కరీంనగర్‌లో పర్యటించనున్న సీఎం కేసీఆర్.. దళిత బంధుపై సమీక్ష.