WiFi: ఇంట్లో వైఫై సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదా.. కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి..

ఇంట్లో వై ఫై సిగ్నల్స్ సరిగ్గా అందడం లేదా? రీల్స్ లోడ్ అవ్వడానికి గంటలు పడుతోందా? నెట్ స్లో అవ్వడానికి గోడలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. మీ వంటగదిలోని మైక్రోవేవ్ ఓవెన్ నుండి హాల్‌లోని అక్వేరియం, అద్దాల వరకు.. మన ఇంట్లోనే ఉంటూ వై ఫై స్పీడ్‌ను దొంగిలిస్తున్న ఆ వింత శత్రువులు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

WiFi: ఇంట్లో వైఫై సిగ్నల్‌ సరిగ్గా రావడం లేదా.. కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి..
How To Increase Wi Fi Speed At Home

Updated on: Jul 11, 2026 | 1:29 PM

ఈ రోజుల్లో అన్నం లేకపోయినా ఉండగలరేమో కానీ నెట్ లేకపోతే క్షణం కూడా గడవదు. అంతలా డిజిటల్ ప్రపంచంతో ముడిపడిపోయాం. అయితే కొన్నిసార్లు వై ఫై సిగ్నల్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడం, రీల్స్ లోడ్ అవ్వడానికి గంటలు పట్టడం చూస్తుంటాం. దీనికి గోడలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. మీ ఇంట్లో ఉండే కొన్ని విచిత్రమైన వస్తువులే మీ వై ఫైకి శత్రువులని మీకు తెలుసా? ఈ రహస్యాలన్నింటినీ 1993లో ప్రపంచంలోనే తొలి పెద్ద వై ఫై నెట్‌వర్క్‌ను రూపొందించిన శాస్త్రవేత్తల బృంద నాయకుడు అలెక్స్ హిల్స్ తన వై-ఫై అండ్ ది బ్యాడ్ బాయ్స్ ఆఫ్ రేడియో అనే పుస్తకంలో వివరంగా పంచుకున్నారు.

మైక్రోవేవ్ ఓవెన్

ఆస్ట్రేలియాలోని ఖగోళ శాస్త్రవేత్తలను 17 ఏళ్ల పాటు కొన్ని మిస్టీరియస్ సిగ్నల్స్ గందరగోళానికి గురిచేశాయి. అవి ఏలియన్స్ పంపినవని కొందరు, సూర్యుడి నుంచి వచ్చినవని కొందరు భావించారు. తీరా చూస్తే.. ఆఫీస్ క్యాంటీన్‌లోని మైక్రోవేవ్ ఓవెన్ అని తేలింది. అవును, చాలా వై ఫై రూటర్లు పనిచేసే 2.4 GHz ఫ్రీక్వెన్సీపైనే ఈ ఓవెన్లు కూడా పనిచేస్తాయి. పాత బడిన లేదా పాడైన ఓవెన్ల నుండి లీకయ్యే తరంగాలు మీ వై ఫై సిగ్నల్‌ను ముక్కలు చేయగలవు.

అందమైన మీన్ల తొట్టి

ఇంట్లో అక్వేరియం ఉండటం ప్రశాంతతను ఇస్తుంది కానీ వై ఫైకి మాత్రం ఇది పెద్ద శాపం. రేడియో సిగ్నల్స్ నీటి గుండా ప్రయాణించినప్పుడు, నీటి అణువులు ఆ సిగ్నల్స్శక్తిని పీల్చేస్తాయి. దీనినే శాస్త్రవేత్తలు షాడోయింగ్ అంటారు. రూటర్‌కు, మీ ఫోన్‌కు మధ్యలో మీన్ల తొట్టి ఉంటే అక్కడ సిగ్నల్ అందకపోవడం ఖాయం. ఇటుకలు, కాంక్రీట్ గోడలు కూడా ఇలాగే సిగ్నల్స్‌ను బలహీనపరుస్తాయి.

గోడకున్న అద్దాలు – టీవీలు

రేడియో తరంగాలు కూడా ఒక రకమైన కాంతి రూపమే. కాంతి అద్దంపై పడితే ఎలా పరావర్తనంచెందుతుందో.. వై ఫై సిగ్నల్స్ కూడా అద్దాలు, పెద్ద టీవీ స్క్రీన్లు, లోహపు రేకులు తగిలితే పక్కకు తప్పుకుంటాయి. దీనివల్ల ఇల్లు మొత్తం సిగ్నల్ సమానంగా అందదు.

చలికాలం – మంచు తుఫానులు

బహిరంగ ప్రదేశాల్లో వై ఫై వాడుతుంటే వర్షం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ విపరీతమైన చలి, మంచు కురిస్తే మాత్రం వై ఫై కేబుల్స్ దెబ్బతింటాయి. శాటిలైట్ డిష్‌లపై మంచు పేరుకుపోవడం వల్ల కూడా నెట్ నిలిచిపోతుంది.

వై ఫై స్పీడ్ పెంచడానికి సూపర్ టిప్స్

రూటర్ స్థానం మార్చండి: రూటర్‌ను ఎప్పుడూ ఇంటి మధ్యలో, వీలైనంత ఎత్తులో ఉంచండి.

అడ్డంకులు తొలగించండి: మీ రూటర్‌కు దగ్గరలో అద్దాలు, పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు, అక్వేరియంలు లేకుండా చూసుకోండి.

టెక్నాలజీ అప్‌గ్రేడ్: పాత 2.4 GHz రూటర్ల కంటే కొత్త 5 GHz రూటర్లను వాడటం వల్ల మైక్రోవేవ్ ఓవెన్ వంటి వస్తువుల నుంచి అంతరాయం ఉండదు.

మెష్ నెట్‌వర్క్ : ఇల్లు పెద్దదైతే, సిగ్నల్స్ అన్ని మూలలకూ చేరడానికి వై-ఫై ఎక్స్‌టెండర్లు లేదా మెష్ సిస్టమ్‌లను ఉపయోగించండి.

Follow Us