Science Facts: నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి? దీని వెనుక సైన్స్‌ ఇదే..

|

Apr 04, 2022 | 11:16 AM

వేసవి, చలికాలాల్లో నదులు, కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా గమనించారా?..

Science Facts: నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి? దీని వెనుక సైన్స్‌ ఇదే..
Untitled 8
Follow us on

Why is ground water warm during winters and cool during summers? వేసవి, చలికాలాల్లో నదులు, కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎప్పుడైనా గమనించారా? అంటే వేసవి కాలంలో నదులు (river water), చెరువుల్లోని నీరు చల్లగా మారుతుంది. అదే శీతాకాలంలో ఐతే గోరువెచ్చగా మారుతుంది. నీటి ఉష్ణోగ్రత – పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా (temperature of water) ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినా.. చెరువులు, నదుల్లోని నీరు చల్లగా ఉంటుంది. ఈ తేడాలెందుకు ఏర్పడతాయంటే..

వేసవిలో నీరు ఎందుకు చల్లగా ఉంటుందంటే.. నిజానికి వేసవిలో నీరు వేడిగా మారకుండా గరిష్ట ఉష్ణోగ్రతను భరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నీరు వేడి చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. అందువల్లనే నదులు, చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలంలో నీరు ఎందుకు గోరువెచ్చగా ఉంటుందంటే.. నీటి ఉష్ణోగ్రత దాని అణువుల వేగంపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఎంత వేగంగా కదిలితే, నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉంటుంది. అదే నీటి అణువుల వేగం తక్కువగా ఉంటే చల్లగా ఉంటుంది. అందువల్లనే బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చెయ్యదు. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు భూమి కింద ఉండే నీరు ప్రభావితం అవ్వదు. వేసవిలో భూమి కింద ఉండే నీరు చల్లగానూ, చలికాలంలో గోరువెచ్చగానూ ఉండడానికి కారణం ఇదే.

Also Read:

Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..