Manholes Covers: మ్యాన్‌హోల్స్‌ గుండ్రంగా ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!

Manholes Covers: సాధారణంగా మ్యాన్‌హోల్ మూతల బరువు సాధారణంగా 90 నుంచి 140 కిలోల మధ్య ఉంటుంది. ఇవి కాంక్రీటు లేదా కాస్ట్ ఇనుముతో తయారు చేస్తారు. మ్యాన్‌హోల్ ఓపెనింగ్ అంచు చుట్టూ ఒక విభాగం ఉంటుంది. దానిపై ఈ కవర్ సులభంగా..

Manholes Covers: మ్యాన్‌హోల్స్‌ గుండ్రంగా ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
Manholes Covers

Updated on: Dec 26, 2025 | 2:59 PM

Manholes Covers: మీరు రోడ్లపై వెళ్తున్నప్పుడు అక్కడక్కడ రోడ్‌ సైడ్‌లో లేదా మధ్యలో మ్యాన్‌ హోళ్లను చూసే ఉంటారు. అవి గుండ్రంగా ఉంటాయి. మరి మ్యాన్‌హోల్స్‌ గుండ్రంగా ఎందుకు ఉంటాయి? చత్రస్రాకారంలో ఎందుకు ఉంటావు అని మీకెప్పుడైనా డౌట్‌ వచ్చిందా? చాలా వరకు మ్యాన్‌హోల్స్ క్రమపద్ధతిలోనే మూసి ఉంటాయి. ఇవి ఉన్న కారణంగానే ఇంజనీర్లు, కార్మికులు, ఇన్‌స్పెక్టర్లు మొదలైనవారంతా పలు మరమ్మతు పనులను చేయవచ్చు. వీటిపై కప్పి ఉంచే మూతలు గుండ్రంగా ఉంటాయి. దీని వెనుక కారణం కారణం ఏంటో తెలుసా?

మ్యాన్‌హోల్స్ గుండ్రంగా ఉండటానికి ప్రధాన కారణం భద్రత, సౌలభ్యం. ఎందుకంటే గుండ్రని మూతను ఏ కోణంలో పెట్టినా అది రంధ్రంలో పడిపోదు. కానీ చతురస్రాకారపు మూత వికర్ణంగా పడిపోయే అవకాశం ఉంది. వీటి మూతలు మూసివేసే క్రమంలో కొన్ని సందర్భాలలో అందులో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ గుండ్రంగా ఉండే మూతలు ఎలా పెట్టినా అందులో పడిపోయే అవకాశం ఉండదు. అంతేకాకుండా గుండ్రని ఆకారం భూమి ఒత్తిడిని తట్టుకోవడానికి బలంగా ఉంటుంది. సులభంగా దొర్లించవచ్చు. ఏదైనా రిపేరు చేసే సమయంలో తీయడం, మూసివేయడం సులభంగా ఉంటుంది. అలాగే తయారీకి కూడా చౌకగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: RBI: ఇక 10 రూపాయల నోట్లు కనిపించవా..? ఆర్బీఐ అసలు ప్లాన్‌ ఇదే!

ఇవి కూడా చదవండి

నిజానికి మ్యాన్‌హోళ్ల మూతలు గుండ్రంగా ఉండడం వెనుక… ప్రమాదాలు జరగకుండా చూడాలనేదే ప్రధాన కారణం. ఇదేకాకుండా ఈ వృత్తాకార కవర్‌ను తీసివేసిన తర్వాత, దానిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం చాలా సులభం అవుతుంది. అదే చత్రస్రాకారంలో ఉంటే దొర్లించడం కష్టం అవుతుంది. పని చేసే సిబ్బంది మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో వారు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. గుండ్రంగా ఉంటే మోసాల్సిన అవసరం ఉండదు. దానిని టైర్‌లాగా దొర్లించుకుంటూ తీసుకెళ్లవచ్చు. దీంతో వారికి శ్రమ తగ్గుతుంది.. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది.

ఖరీదు తక్కువే:

వృత్తాకారంగా ఉండే మ్యాన్‌హోల్ మూతలు ఖర్చు కూడా తక్కువే ఉంటుందట. వాటిని రోల్ చేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లవచ్చు. అవి గుండ్రంగా కాకుండా వేరే ఆకారంలో ఉంటే వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం కష్టతరమవుతుంది. మ్యాన్‌హోల్స్ చాలా హెవీ మెటల్‌తో చేసిన ప్లేట్‌లతో మూసివేసి ఉంటాయి. వీటిని సులభంగా తొలగించవచ్చు.

బరువు:

సాధారణంగా మ్యాన్‌హోల్ మూతల బరువు సాధారణంగా 90 నుంచి 140 కిలోల మధ్య ఉంటుంది. ఇవి కాంక్రీటు లేదా కాస్ట్ ఇనుముతో తయారు చేస్తారు. మ్యాన్‌హోల్ ఓపెనింగ్ అంచు చుట్టూ ఒక విభాగం ఉంటుంది. దానిపై ఈ కవర్ సులభంగా ఇమిడిపోతుంది. ఈ కవర్‌లు రోడ్డుపై ఉండే చెత్తాచెదారం కాలువలో పడకుండా చేస్తాయి.

Best Selling Bikes: మళ్లీ రికార్డ్‌.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ ఇదే.. టాప్‌ 10 జాబితా!