వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక ముఖ్యమైన ఫీచర్లను తన మెసేజింగ్ యాప్‌కు విడుదల చేస్తోంది. ఇటీవల కొత్త అప్‌డేట్‌లో చాట్ లాక్, హెచ్‌డి ఫోటో ఎంపిక, సందేశాలను సవరించడం, స్క్రీన్ షేరింగ్ మొదలైన కొత్త ఫీచర్లను ఒకదాని తర్వాత ఒకటి పరిచయం చేసింది. ఇవన్నీ చాలా ముఖ్యమైన వాట్సాప్ ఫీచర్లు ప్రజలను మరింత దగ్గర చేస్తాయి. ఇప్పుడు, వాట్సాప్ మరో అనూహ్యమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మీరు ఒకే యాప్‌లో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించవచ్చు. ఇంతకుముందు వ్యక్తులు ఒక స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించడానికి డ్యూయల్ లేదా క్లోన్ యాప్ ఫీచర్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పటివరకు మీరు ఒక వాట్సాప్ అప్లికేషన్‌లో రెండు మొబైల్ నంబర్‌లను ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం.
అయితే ఇంకో విషయం ఏంటంటే.. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మీ ప్రతి ఖాతాకు సంబంధించిన గోప్యత, నోటిఫికేషన్ సెట్టింగ్‌లపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది.
ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రకటించింది. రాబోయే వారాల్లో యాప్‌లో అందరికి అందుబాటులోకి వస్తాయని కూడా ఇది ధృవీకరించింది. అంటే అక్టోబరు చివరి నాటికి లేదా నవంబర్ ఆరంభంలో అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం వాట్సాప్ బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్ మొదట వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో వస్తుంది.
తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్ దాని iOS, Android వినియోగదారుల కోసం వాయిస్ నోట్స్‌లో ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను విడుదల చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉంది. రాబోయే రోజుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. యాప్‌లో ఎవరికైనా ఫోటోలు, వీడియోలను పంపేటప్పుడు వాట్సాప్ వినియోగదారులు ఇప్పటికే ‘వీన్ వన్స్’ ఎంపికను ఎంచుకోవచ్చు. ఇప్పుడు అదే ఫీచర్ వాయిస్ నోట్స్‌కు కూడా రానుంది. అయితే వాట్సాప్ సంస్థ యూజర్లను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్ అంటూ ఉండదు. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి