WhatsApp Tips: వాట్సాప్ వాయిస్ కాల్స్‌ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఇలా ట్రై చేయండి..!

|

May 10, 2022 | 8:00 AM

WhatsApp Tips: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ కలిగిన మేసేజింగ్ యాప్ వాట్సాప్. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ కోసం చేసుకోవడానికి..

WhatsApp Tips: వాట్సాప్ వాయిస్ కాల్స్‌ రికార్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే, ఇలా ట్రై చేయండి..!
Whatsapp
Follow us on

WhatsApp Tips: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ కలిగిన మేసేజింగ్ యాప్ వాట్సాప్. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌ కోసం చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. దీని వినియోగం సులభం, సురక్షితం అని భావించి చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు. అయితే, సాధారణ ఫోన్ కాల్స్‌లో వాయిస్‌ను రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, వాట్సప్‌లో మాత్రం వాయిస్ కాల్స్ రికార్డ్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ, ప్రస్తుత టెక్ యుగంలో.. వాట్సాప్ కాల్స్‌ని కూడా రికార్డ్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వివిధ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆధారంగా ఈ వాట్సప్ కాల్స్‌ని రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వాట్సాప్‌ కాల్స్‌ ఎలా రికార్డ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1:
వాట్సాప్ కాల్‌ని వినియోగించడానికి సెకండ్ ఫోన్‌ను ఉపయోగించవచ్చు. అయితే, వాట్సప్ కాల్ మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్ ఆన్ చేయాలి. ఆ మాటలను మరొక ఫోన్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా చేసే విధానం.

స్టెప్ 2:
ప్రైవేట్ కాల్‌ని రికార్డ్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌ని ఉపయోగించడంపై అభ్యంతరం లేకపోతే Play Store నుండి థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌లను ప్రాధాన్యతను బట్టి ఎంచుకోవాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు సమీక్షలను చూసుకోవడం, రేటింగ్‌లను చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ రేటింగ్స్ ఉన్న యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని దాని ఆధారంగా రికార్డ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఏసీఆర్ యాప్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ కోసం చాలా మంది నిపుణులు ‘‘కాల్ రికార్డర్ క్యూబ్ ఏసీఆర్ యాప్’’ ని రిఫర్ చేస్తున్నారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ రెండింటినీ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ యాప్ టెలిగ్రామ్, స్లాక్, జూమ్, ఫేస్‌బుక్, సిగ్నల్, ఇతర యాప్‌ల కాల్స్‌ని సైతం రికార్డ్ చేయగలదు.

థర్డ్ పార్టీ యాప్‌ని ఉపయోగించి వాట్సాప్ కాల్స్‌ను ఎలా రికార్డ్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి..
1. మీ ఫోన్‌లో ‘కాల్ రికార్డర్ క్యూబ్ ACR యాప్‌’ ని ఇన్‌స్టాల్ చేసుకోండి.
2. యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తరువాత ఫోన్‌లోని యాక్సెసిబిలిటీ > సెట్టింగ్‌ల విభాగంలో క్యూబ్ ACR యాప్ కనెక్టర్‌ను తప్పనిసరిగా అనుమతించాలి.
3. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్‌ని డిసేబుల్ చేయాల్సి వస్తుంది.
4. మీ WhatsApp కాల్‌లను రికార్డ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.