WhatsApp: వాట్సాప్‌ గ్రూప్‌లకు సంబంధించి సూపర్ ఫీచర్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌.

|

Mar 09, 2023 | 2:44 PM

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు...

WhatsApp: వాట్సాప్‌ గ్రూప్‌లకు సంబంధించి సూపర్ ఫీచర్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌.
Whatsapp
Follow us on

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ. ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నా పోటీని తట్టుకొని నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. వాట్సాప్‌ గ్రూప్‌లకు సంబంధించిన ఈ ఫీచర్‌ యూజర్లను మరింత ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతకీ ఈ ఫీచర్‌ ఏంటి.? దాని ఉపయోగం ఏంటంటే.. ఫ్రెండ్స్‌ అందరూ కలిసి ఓ టూర్‌ ప్లాన్‌ చేస్తారు. టూర్‌కి సంబంధించిన అన్ని వివరాలను చర్చించుకోవడం కోసం ఒక గ్రూప్‌ను స్టార్ట్‌ చేస్తారు. నిజానికి టూర్‌ ముగిసిన తర్వాత ఆ గ్రూప్‌ అవసరం ఉండదు. దీంతో ఆ గ్రూప్‌ను డిలీట్‌ చేయడం మర్చిపోతుంటారు. దీంతో చాట్‌ బాక్స్‌లో గ్రూప్‌ ఖాళీగా ఉండిపోతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

‘ఎక్స్‌పైరింగ్ గ్రూప్‌’ అనే పేరుతో వాట్సాప్‌ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో తాత్కలిక అవసరం కోసం ఏర్పాటు చేసిన గ్రూప్‌ కొంత సమయానికి ఆటోమెటిగ్‌గా డిలీట్‌ చేసుకోవచ్చు. ఏ తేదీన గ్రూప్‌ డిలీట్‌ అవ్వాలో గ్రూప్‌ క్రియేట్ చేసే సమయంలో సెట్ చేసుకోవచ్చు. దీంతో అనవసర గ్రూప్‌లు వాటంతటవే డిలీట్‌ అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. టెస్టింగ్ పూర్తికాగానే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..