WhatsApp Update: సరికొత్తగా వాట్సాప్.. కొత్త ఫీచర్లు మామూలుగా లేవుగా.. మీరు అప్‌డేట్ చేశారా?

|

May 22, 2024 | 2:24 PM

ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దానిలో భాగంగా కొత్తగా చాట్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

WhatsApp Update: సరికొత్తగా వాట్సాప్.. కొత్త ఫీచర్లు మామూలుగా లేవుగా.. మీరు అప్‌డేట్ చేశారా?
Whatsapp
Follow us on

వాట్సాప్ యాప్ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు అందరికీ తెలిసిన పదమే ఇది. మన జీవితంలో భాగంలా మారిన వాట్సాప్ ను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ వివిధ పనుల కోసం ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా ఫొటోలు, డాక్యుమెంట్లు, పత్రాలు పంపించడానికి చక్కని మార్గం ఇది. అలాగే వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

కొత్త ఫీచర్లు..

ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పిలవబడే వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. యాప్ వినియోగంలో సౌలభ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు చేస్తూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దానిలో భాగంగా కొత్తగా చాట్ ఫిల్టర్ తో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మెరుగైన సేవలు..

ముఖ్యంగా చాట్ ఆర్గనైజేషన్‌ను మెరుగుపరచడానికి చాట్ ఫిల్టర్ ఫీచర్‌ ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. అలాగే వీడియో కాల్‌ సమయంలో స్క్రీన్ షేరింగ్ కోసం ఆడియో సపోర్ట్ కూడా అందిస్తుంది. వినియోగదారులు తమ ప్రాధాన్యతల ఆధారంగా నిర్దిష్ట రకాల చాట్‌లను త్వరగా గుర్తించడం, యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఓఎస్ లేటెస్ట్ వెర్షన్ 24.10.74 లో తాజా అప్‌డేట్‌తో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తోంది. యాప్ స్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అందుబాటులోకి..

వాట్సాప్ చాట్ ఫిల్టర్ ను మొదట్లో ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షించారు. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు అందరికీ అందించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఫీచర్ ను వాట్సాప్ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ రాబోయే కొన్ని రోజుల్లోనే కొందరు వినియోగదారులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

చాట్ ఫిల్టర్ అంటే..

వాట్సాప్ లోని చాట్ లిస్ట్ పైభాగంలోని ఫిల్టర్లను కొత్త చాట్ ఫిల్టర్ జోడిస్తుంది. లిస్ట్ పైభాగంలో ఆల్, అన్ రీడ్, గ్రూప్స్ అనే మూడు ఫిల్టర్లు ఉంటాయి. ఆల్ అనే దానిపై ట్యాప్ చేస్తే అన్ని చాట్స్ కనిపిస్తాయి. అన్ రీడ్ పై నొక్కితే చదవని మెసేజ్ లు మాత్రమే డిస్ ప్లే అవుతాయి. ఇక గ్రూప్ ఫిల్టర్ గ్రూప్ చాట్స్ ను మాత్రమే చూపుతుంది. ముఖ్యంగా చాట్ ఫిల్టర్ మన చదవని సందేశాలు, వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌ల ద్వారా సంభాషణలను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులకు కొత్త అనుభవాన్ని, సౌలభ్యాన్ని అందిస్తుంది.

ఉపయోగాలెన్నో..

చాట్ ఫిల్టర్ తో పాటు ఐఓఎస్ అప్ డేట్ లో మరిన్నిప్రయోజనాలు ఉన్నాయి. గతంలో వీడియో కాల్స్ లో స్క్రీన్ షేరింగ్ సమయంలో ఫోన్ ఆడియో అవతల వారికి వినిపించేది కాదు. ఇప్పడు వినిపించేలా అప్ డేట్ చేశారు. దీంతో వీడియో కాల్స్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఆడియోను ప్లే చేయవచ్చు. అలాగే ఇంటర్ ఫేస్ ను మరింత మెరుగు పరచడానికి కొత్త ఐకాన్స్ జోడించింది. అలాగే పాస్‌కీ ఫీచర్ మరింత భద్రత కల్పిస్తుంది. ఇటీవలే ఐఓఎస్ లో రోల్ అవుట్ అయిన ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆరు నెలల తర్వాత వస్తుందని భావించారు. కానీ పాస్‌కీలు ఇప్పుడు ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

పాస్‌కీలు అంటే..

ఐరిస్, బయోమెట్రిక్, పిన్ తదితర బహుళ ప్రమాణీకరణ ఎంపికలను పాస్ కీ అందిస్తుంది. ఇది అనధికార యాక్సెస్‌ ను నిరోధించి భద్రత అందిస్తుంది. ఒక వేళ ఎవరైనా వాట్సాప్ సర్వర్ ను హాక్ చేసినా, మీ డేటా మాత్రం చోరీ చేయలేరు. దీనివల్ల మీ వాట్సాప్ ఖాతా మరింత సురక్షితంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..