WhatsApp Feature Update: రియాక్షన్ నోటిఫికేషన్‌తో మారనున్న వాట్సప్ ఛాటింగ్.. త్వరలో అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..!

|

Nov 22, 2021 | 8:21 AM

వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లపై పనిచేస్తూ, యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. తాజాగా వాట్సాప్ రియాక్షన్ నోటిఫికేషన్..

WhatsApp Feature Update: రియాక్షన్ నోటిఫికేషన్‌తో మారనున్న వాట్సప్ ఛాటింగ్.. త్వరలో అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..!
Whatsapp Reaction Notification Feature
Follow us on

Reaction Notification Feature: వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లపై పనిచేస్తూ, యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. తాజాగా వాట్సాప్ రియాక్షన్ నోటిఫికేషన్ అనే ఫీచర్‌పై పనిచేస్తోందని తెలుస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ గూగుల్ ప్లే‌లో (Google Play Store)బీటా ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ (Android) బీటా వెర్షన్ 2.21.24.8లో రన్ అవుతోంది.

వాట్సాప్ బీటాలో రియాక్షన్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. మెసేజ్ రియాక్షన్ అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ సిద్ధం చేస్తున్నట్టు ఇప్పటికే పలు నివేదికలు కూడా వెల్లడయ్యాయి. అయితే మొదట్లో ఈ ఫీచర్‌లో కొన్ని తప్పులు దొర్లడంతో వెంటనే తొలగించారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.21.22.7 అప్‌డేట్ కోసం వాట్సప్ బీటాలో కనిపించింది. బీటా వెర్షన్‌లో కొంతమందికి ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

ఇంతకుముందు iOS కోసం రియాక్షన్ నోటిఫికేషన్‌లపై వాట్సప్ పని చేసింది. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌కి తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే బీటాలో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండడంతో త్వరలోనే కొత్త అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకరానున్నారు.

ఈ సరికొత్త అప్‌డేట్ తర్వాత సందేశాలకు ప్రతిస్పందించే ఫీచర్ అందుబాటులో రానుంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పలు వెబ్‌సైట్లలో తెగ సందడి చేస్తోంది. ఇది కేవలం పర్సనల్ చాట్‌కే కాకుండా గ్రూప్ చాట్‌ల కోసం కూడా వాడుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచి మొదలవుతుందనే విషయంపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

రియాక్షన్ నోటిఫికేషన్ ఫీచర్ పాటు యూజర్లకు అనేక ఇతర అద్భుతమైన ఫీచర్లను తీసుకొచ్చేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తుంది. ‘యాడ్ ఆన్ ఫేస్‌బుక్’ ఎంపిక ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అదనంగా iOS వినియోగదారులు త్వరలో ‘అక్సెప్ట్ మై కాంటాక్ట్స్’ ఫీచర్‌తో మెరుగైన గోప్యతను అందుకోనున్నారు.

Also Read: Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు

iPhone 14 Pro: ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇక ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు..