
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడుతున్న యాప్ వాట్సప్. ఎవరి ఫోన్‌లో చూసినా ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. సులువుగా ఉపయోగించుకునేలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో వాట్సప్‌కు అందరూ అలవాటు పడిపోయారు. ఇటీవల కొత్త మెస్సేజింగ్ యాప్స్ వస్తున్నా వాటికి అంత ఆదరణ లభించడం లేదు. వాట్సప్‌ను మెటా టేకోవర్ చేసిన తర్వాత దాని రూపమే మారిపోయింది. యూజర్లకు మరిన్ని సేవలు అందించేందుకు వాట్సప్ ఎప్పుడు ఏదోక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా మరో అద్భుత ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను వాట్సప్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
మీరు వాట్సప్‌లో ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేశారనుకుందాం. వారు మీ కాల్‌ను ఆన్సర్ చేయనప్పుడు మీరు వెంటనే వాయిస్ లేదా వీడియో నోట్ పంపవచ్చు. చాట్ స్క్రీన్‌లో మిస్ట్ కాల్ క్రిందనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు నోట్ పంపించవచ్చు. ఇప్పటికే చాలామంది ఫోన్లలో ఈ ఫీచర్ అప్‌గ్రేడ్ అయింది. మిగతా ఫోన్లల్లో కూడా ఇప్పుడు ఇది అందుబాటులోకి తెచ్చారు.
ఇక వాట్సప్ డెస్క్‌టాప్ వెర్షన్ వాడేవారికి కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌లో కొత్తగా మీడియా ట్యాబ్ జోడించారు. ఎవరైనా మీకు ఫైల్స్, లింకులు, వీడియోలు, ఫొటోలు పంపినప్పుడు మీడియా ట్యాబ్‌లో ఒకేచోట కనిపిస్తాయి. దీని వల్ల మీరు వెతుక్కోవాల్సిన పని ఉండదు. చాట్‌లకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సప్ తెలిపింది.
వాట్సప్ స్టేటస్ పెట్టేటప్పుడు మనం స్టిక్కర్లు వాడుతూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా మరికొన్ని స్టిక్కర్లను జోడించింది. ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, క్వశ్చన్లు, మ్యూజిక్ లిరిక్స్ వంటివి జోడించొచ్చు. అలాగే వాట్సప్ ఛానెల్ ఉన్నవారికి ప్రశ్న అనే ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల అడ్మిన్లు తమ యూజర్లతో ఎంగేజ్ కావోచ్చు. ఇందులో యూజర్లు ఇచ్చన ఆన్సర్లను అడ్మిన్స్ మాత్రమే చూడగలుగుతారు.