Whatsapp: కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్‌.. ఒక్క నెలలోనే 73 లక్షల అకౌంట్స్‌ నిషేధం

|

Oct 03, 2023 | 11:59 AM

ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏమాత్రం కూడా తగ్గకపోవడానికి మరో ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి. ఇలా ఫీచర్లతో పాటు ఫేక్‌ న్యూస్, అశ్లీల సమాచార వ్యాప్తిని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్‌. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు పలు వాట్సాప్‌ ఖాతాలను నిషేధిస్తూ వస్తోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతీ నెల వాట్సాప్‌ ఖాతాలను నిషేధిస్తూ...

Whatsapp: కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్‌.. ఒక్క నెలలోనే 73 లక్షల అకౌంట్స్‌ నిషేధం
Whatsapp
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ తీసుకొస్తున్న కొంగొత్త ఫీచర్స్‌ వాట్సాప్‌ క్రేజ్‌ను మరింత పెంచుతూ వస్తోంది.

ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏమాత్రం కూడా తగ్గకపోవడానికి మరో ప్రధాన కారణం ఇదేనని చెప్పాలి. ఇలా ఫీచర్లతో పాటు ఫేక్‌ న్యూస్, అశ్లీల సమాచార వ్యాప్తిని కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్‌. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు పలు వాట్సాప్‌ ఖాతాలను నిషేధిస్తూ వస్తోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతీ నెల వాట్సాప్‌ ఖాతాలను నిషేధిస్తూ వస్తున్న వాట్సాప్‌.. తాజాగా ఆగస్టు ఒక్క నెలలోనే ఏకంగా 74.2 లక్షల ఖాతాలను నిషేధించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొతత్ ఐటీ నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే జులైతో పోల్చితే నిషేధించిన అకౌంట్ల సంఖ్య రెండు లక్షలకుపైగా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఆగస్టు నెలలో 35 లక్షల అకౌంట్స్‌పై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. సదరు ఖాతాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన తర్వాత ముందస్తుగానే నిషేధించినట్లు వాట్సాప్‌ తెలిపింది.

ఫేక్‌ న్యూస్ వ్యాప్తి, అశ్లీల సమాచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా యూజర్లకు మరింత భద్రతపరమైన, మెరుగైన సేవలు అందించడమే ఏకైక లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇందుకోసం ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న ఇంజనీర్స్‌, డేటా సైంటిస్టులను రిక్రూట్ చేసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇతర యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్స్‌తో పాటు సదరు ఖాతాల డేటాను విశ్లేషించిన అనంతరం ఖాతాలను నిషేధిస్తున్నట్లు వాట్సాప్‌ చెబుతోంది. డేటాను విశ్లేషించిన అనంతరం అకౌంట్‌ను నిషేధించాలా.? లేదా ముందుగా వార్నింగ్ ఇవ్వాలా.? అన్ని నిర్ణయం తీసుకుంటామని వాట్సాప్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..