Laptop Virus: బీ కేర్‌ఫుల్.. ఈ మూడు జరిగితే మీ ల్యాప్‌టాప్ వైరస్ బారిన పడినట్లే…

మీ ల్యాప్‌టాప్ పనితీరు మందగిస్తుందా..? సిస్టమ్ క్రాష్ అవుతుందా..? సంబంధం లేని యాడ్స్ మీకు నోటిఫికేషన్ల తరహాలో వస్తున్నాయా..? అయితే మీర జాగ్రత్త పడాల్సిందే. మీ ల్యాప్‌టాప్ వైరస్ బారిన పడిందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది చూద్దాం.

Laptop Virus: బీ కేర్‌ఫుల్.. ఈ మూడు జరిగితే మీ ల్యాప్‌టాప్ వైరస్ బారిన పడినట్లే...
Laptop Virus

Updated on: Nov 22, 2025 | 4:11 PM

టెక్నాలజీ యుగంలో ల్యాప్‌టాప్ అనేది ఉద్యోగులు, వ్యాపారులకు నిత్యావసర పరికరంగా మారిపోయింది. కరోనా తర్వాత వర్క్ హోమ్ ఉద్యోగాలు ఎక్కువైపోయాయి. కంపెనీలు కూడా తమ ఖర్చును తగ్గించుకునేందుకు వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ల్యాప్‌టాప్ అనేది ఉద్యోగులందరికీ అత్యవసరమైన వస్తువైపోయింది. ల్యాప్‌టాప్ వాడేవారిని వైరస్ సమస్య వేధిస్తూ ఉంటుంది. దీని వల్ల ల్యాప్‌టాప్ పనితీరు తగ్గడంతో పాటు మీ డేటాకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కొన్ని సంకేతాల ద్వారా మీ ల్యాప్‌టాప్ వైరస్ బారిన పడిందని తెలుసుకోవచ్చు.

ల్యాప్‌టాప్ క్రాష్

మీ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి సమస్య లేకపోయినా ప్రతీసారి క్రాష్ అవుతుంటే.. అందులోకి వైరస్ ప్రవేశించి ఉండొచ్చు. వైరస్ లేదా మాల్వేర్ ఎంటర్ అయితే ల్యాప్‌టాప్‌ పదే పదే క్రాష్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా యాప్‌లు సరిగ్గా పనిచేయవు. ఇలాంటి సమయంలో వెంటనే జాగ్రత్త పడకపోతే నష్టం జరుగుతుంది.

పాప్-అప్ యాడ్స్

ఇక ల్యాప్‌టాప్‌లోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు సంబంధం లేని పాప్-ఆప్ యాడ్స్ కనిపిస్తాయి. ఏవోక యాడ్స్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తూనే ఉంటాయి. ఈ యాడ్స్‌పై మీరు క్లిక్ చేయడం వల్ల మీ డేలా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే జాగ్రత్త పడండి.

ల్యాప్‌టాప్ స్లో కావడం

ల్యాప్‌టాప్ క్రమక్రంగా స్లో అవుతున్నా వైరస్ ప్రవేశించినట్లు అర్ధం. మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా షట్‌డౌన్ చేసినప్పుడు ప్రక్రియ ఆలస్యం కావడం, ఏదైనా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆలస్యంగా తెరుచుకోవడం లాంటి సమస్యలు ఎదురైనా వైరస్ చేరినట్లు గమనించాలి.

వైరస్ ఎలా తొలగించుకోవాలి..?

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక యాంటీ వైరస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కొనుగోలు చేసి మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేసి స్కాన్ చేయండి. దాని వల్ల మీ సిస్టమ్ నుంచి వైరస్ బయటకెళ్తుంది.

 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి