Club House App : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. బాగుంటే ట్రెండింగ్‌లో నిలిచి నెటిజన్ల ఆదరణ అందుకుంటాయి. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా యాప్‌లో మార్పులు రాకపోతే.. అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్నవి కూడా కనుమరుగైన సందర్భాలున్నాయి. అంతేకాదు కొత్త యాప్స్ హవా తట్టుకోలేక పోటీలో వెనుకబడ్డ యాప్స్ కూడా బోలెడు. ఈ క్రమంలోనే ‘క్లబ్‌హౌస్’ అనే న్యూ యాప్ కొద్ది నెలల్లోనే ఐవోఎస్(iOS) వినియోగదారుల్లో సంచలనం సృష్టించడంతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టా, జూమ్, వాట్సాప్, టిక్‌టాక్‌లను వెనక్కి నెడుతూ టాప్ యాప్‌గా కొనసాగేందుకు ప్రయత్నిస్తోంది. టెక్నాలజీ టైటాన్స్, బిజినెస్ టైకూన్స్, సెలెబ్రిటీ ఐకాన్స్, రాజకీయ ప్రముఖులు ఈ యాప్‌ను ఫాలో కావడం మొదలుపెట్టారు. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కూడా ఇటీవలే ‘క్లబ్ హౌస్’ ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. యూఎస్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకుంటున్న ఈ ‘క్లబ్ హౌస్ యాప్’ ప్రత్యేకతలు ఏంటి? అందులోకి ఎలా ఇన్వైట్ చేయాలి? ఇండియన్ యూజర్లకు క్లబ్ హౌస్ ఉందా?
సోషల్ నెట్‌వర్కింగ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్న ‘క్లబ్‌హౌస్’ కూడా పాడ్‌కాస్ట్ లాంటిదే. కానీ ఇందులో లైవ్ ఆడియోలు వినొచ్చు. ఆడియో చాటింగ్ సర్వీస్ అందించే ఈ యాప్‌లో వివిధ అంశాలపై ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్, ప్రముఖులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులెవరైనా అందించే సంభాషణలు, ఇంటర్వ్యూలు, చర్చలను యూజర్లు వినొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కాన్ఫరెన్స్ కాల్ లాంటిది. డిస్కషన్స్, సెషన్స్‌లో పాల్గొన్నవాళ్లు మాట్లాడుతుంటే.. ఆయా టాపిక్స్‌పై ఆసక్తి ఉన్న వినియోగదారులు వాటిని వింటుంటారు.
ఈ ఆడియో-చాట్ సెషన్‌లు వివిధ టాపిక్స్‌పై (ఉదా : టాక్ షోస్, సంగీతం, నెట్‌వర్కింగ్, డేటింగ్, పర్‌ఫార్మెన్స్, రాజకీయ చర్చలు) ఉంటుండగా, యూజర్ తనకు నచ్చిన అంశాల ఆధారంగా ఆయా టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ఫాలో కావచ్చు. కస్టమర్ ఆసక్తి కనబరిచిన అంశాల ఆధారంగా లైవ్‌లో జరుగుతున్న డిస్కషన్స్‌తో పాటు అప్‌కమింగ్ మీటింగ్స్, సెషన్స్ వివరాలను క్లబ్‌హౌస్ నోటిఫికేషన్ అందిస్తుంది లేదా డిస్‌ప్లేలో చూపిస్తుంది. ఉదాహరణకు యూజర్ అంతరిక్ష శాస్త్రాన్ని(స్పేస్ సైన్స్) ఎంచుకుంటే.. సజెషన్స్‌లో ఎలన్ మస్క్ క్లబ్‌హౌస్ సెషన్స్ చూపిస్తుంది. ఈ ఆడియో-చాట్ సెషన్స్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉంటాయి. ఇంట్లో కూర్చునే అమెరికా, రష్యా, యూరప్, జపాన్‌కు చెందిన సెలబ్రిటీల సెషన్స్‌తో పాటు మోదీ, సచిన్, చిరంజీవి డిస్కషన్స్ వినవచ్చు. లైవ్ స్ట్రీమ్ సెషన్స్ సేవ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
David warner : డేవిడ్ వార్నర్ ఈసారి తలైవాగా మారాడు.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వదల్లేదుగా..