Social Media: సునామీ రాలేదు.. భూకంపం సంభవించలేదు.. ప్రపంచం అల్లాడింది.. ఆ 7గంటల్లో ఏమైందంటే..

|

Oct 05, 2021 | 10:12 AM

సునామీ రాలేదు, భూకంపం సంభవించలేదు, ప్రకృతి బీభత్సం జరగలేదు, ఉన్నట్టుండి ప్రపంచాన్ని వరదలేమీ ముంచెత్తలేదు, ఆకాశంలో అల్లకల్లోలమేమీ సంభవించలేదు.

Social Media: సునామీ రాలేదు.. భూకంపం సంభవించలేదు.. ప్రపంచం అల్లాడింది.. ఆ 7గంటల్లో ఏమైందంటే..
Social Media
Follow us on

సునామీ రాలేదు, భూకంపం సంభవించలేదు, ప్రకృతి బీభత్సం జరగలేదు, ఉన్నట్టుండి ప్రపంచాన్ని వరదలేమీ ముంచెత్తలేదు, ఆకాశంలో అల్లకల్లోలమేమీ సంభవించలేదు. కానీ, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఎందుకు ఆ 7 గంటలపాటు మొత్తం విలవిల్లాడిపోయింది. తమ ప్రాణాలు పోయినంతగా పిచ్చెక్కి పోయింది. అసలేం జరుగుతుందో తెలియక అల్లకల్లోలమైపోయారు. ఇదే మనదగ్గరే కాదు.. ప్రపంచం మొత్తం నిస్తేతం అయ్యింది. ఇంతకీ ఆ 7గంటల్లో జరిగింది ఏంటి..? అసలేం జరిగింది..?

ప్రపంచం మొత్తం స్తంభించిపోవడానికి ఊహించని విపత్తేమీ రాలేదు. కొన్ని గంటలపాటు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయాయంతే. దీనికే ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. తమ ప్రాణాలు పోయినంతగా గిలగిలకొట్టేసుకున్నారు. టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా… ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనిపైనే నడుస్తోంది. తిండి లేకపోయినా బతకగలరేమో గానీ, సోషల్‌ మీడియా లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడంతో ఒక్కసారిగా జనం పిచ్చోళ్లు అయిపోయారు.

ఇంతకీ, ఏం జరిగింది? ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడానికి కారణమేంటి? హ్యాకింగ్‌ జరిగిందా? లేక సర్వర్ సమస్యా? లేదంటే ఫేస్‌బుక్ ఉద్యోగుల అంతర్గత తప్పిదమా? అసలేం జరిగింది?

ఒకేసారి మూడు యాప్స్ ఆగిపోవడంతో హ్యాకింగ్‌కి ఛాన్సే లేదంటున్నారు సైబర్ నిపుణులు. ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీమ్‌ కూడా ఇదే చెబుతోంది. సర్వర్ ప్రాబ్లెమ్‌ కావొచ్చనేది మరో వాదన. ఫేస్‌బుక్ ఉద్యోగుల అంతర్గత తప్పిదం వల్ల జరిగి ఉండొచ్చనేది టెక్ ఎక్స్‌పర్ట్స్ మాట. ఇదేమీ కాదు రౌటర్ ప్రాబ్లెమ్ అంటున్నారు మరికొందరు. అసలింతకీ కారణమేంటి?

ఇవి కూడా చదవండి: Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..

PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..