VLC Media Player: అందరికీ సుపరిచితమైన ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్‌వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ VLC మీడియా ప్లేయర్‌ను మనదేశంలో నిషేధించారు. నివేదిక ప్రకారం, వీడియోలాన్ ప్రాజెక్ట్ VLC మీడియా ప్లేయర్, వెబ్‌సైట్‌ను ప్రభుత్వం IT చట్టం, 2000 ప్రకారం నిషేధించింది. VLC మీడియా ప్లేయర్, దాని వెబ్‌సైట్ సేవలు ఇప్పటికే రెండు నెలలుగా నిలిపేశారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. VLC మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే IT చట్టం కింద నిషేధించినట్లు సందేశం కనిపిస్తుంది.
VLC మీడియా ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌లపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు VLC మీడియా ప్లేయర్‌ను టార్గెట్ చేసిందని, ఈమేరకు ప్రభుత్వం VLC ప్లేయర్‌ను బ్యాన్ చేసినట్లు భావిస్తున్నారు.
#blocked
Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo— sflc.in (@SFLCin) June 2, 2022
దీనికి ముందు కూడా భద్రతా కారణాల వల్ల భారతదేశంలో సుమారు 350 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఇటీవల, యుద్దభూమి మొబైల్ ఇండియా (BGMI) కూడా Google Play Store, Apple యొక్క యాప్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీని తర్వాత, స్టోర్ నుంచి BGMI కనిపించకుండా పోవడంతో గేమ్ ప్లేయర్‌లు షాక్ అయ్యారు. BGMI హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. BGMI నిషేధాన్ని తర్వాత ఒక వార్తా సంస్థ ధృవీకరించింది. 2020లో PUBGని నిషేధించిన తర్వాత PUBG కొత్త అవతార్‌గా BGMI ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ నిషేధంపై ఇప్పటివరకు కంపెనీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒక ట్విట్టర్ వినియోగదారు ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఈ ప్లాట్‌ఫారమ్ రెండు నెలల క్రితం నిషేధించారని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఐటీ చట్టం, 2000 ప్రకారం భారతదేశంలో ఈ సాఫ్ట్ వేర్ మూసివేశారని అందులో పేర్కొన్నాడు.