భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ వాడకానికి ముందుకు రావడంతో టాప్ మొబైల్ కంపెనీలన్నీ కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లకు పుట్టినిల్లయిన చైనాలో అన్ని కంపెనీలు తమ కొత్త ఫోన్లను అక్కడ లాంచ్ చేస్తాయి. తాజాగా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వివో తమ స్మార్ట్ ఫోన్ లైనప్‌లో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో ఎక్స్ 90 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇప్పటికే చైనాలో లాంచ్ చేసింది. వివో ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో రెండు ఫోన్లను త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం వివో కంపెనీ ఈ రెండు ఫోన్లను ఈ నెల 26న లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ధర విషయాన్ని పరిశీలిస్తే ఈ రెండు ఫోన్లు కేవలం ఉన్నత శ్రేణి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకునే కంపెనీ తయారు చేసిందని వెల్లడవుతుంది. వివో ఎక్స్90, ఎక్స్ 90 ప్రో ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇంకా అధికారింకంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే లీకువీరులు మాత్రం ఈ ఫోన్ల ఫీచర్ల ఇవేనంటూ హల్‌చల్ చేస్తున్నారు. లీకువీరులు వెల్లడించిన ప్రకారం ఈ రెండు ఫోన్లు 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తాయని పేర్కొంటున్నారు. అలాగే ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 ద్వారా పని చేస్తాయి. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వినియోగదారులకు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం వీ2 చిప్ కూడా ప్రత్యేకంగా ఈ ఫోన్లలో ఉంటుందని తెలుస్తోంది. అయితే వివో ఎక్స్ 90లో వెనుకవైపు 50 ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో పాటు 12 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా, మరో 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో ట్రై కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే ఎక్స్ 90 ప్రో కూడా యొక్క కెమెరా 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో వస్తుంది. అలాగే ఈ రెండు ఫోన్స్‌లో కూడా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అయితే ఎక్స్ 90 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4810 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఎక్స్ 90 ప్రో కూడా 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50 వాట్స్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 4870 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ రెండు ఫోన్ల ధరలు రూ.60 వేల నుంచి రూ 80 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..