Vivo Y18t: ఇది కదా బెస్ట్‌ డీల్‌ అంటే.. రూ. 10 వేలలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్‌

|

Nov 17, 2024 | 8:42 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ చేశారు. వివో వై18టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo Y18t: ఇది కదా బెస్ట్‌ డీల్‌ అంటే.. రూ. 10 వేలలో అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఫోన్‌
Vivo Y18t
Follow us on

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై18టీ పేరుతో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో వై18టీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 269 పిక్సల్‌ డెన్సిటీ, 840 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో కూడిన ఈ స్క్రీన్‌లో 720*1612 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ను అందించారు. తక్కువ బడ్జెట్‌లో మంచి స్క్రీన్‌ కోసం చూసే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇక ఈ ఫోన్‌ Unisoc T612 చిప్‌సెట్ ప్రాసెసర్‌తోప పనిచేస్తుంది. 4GB LPDDR4X ర్యామ్‌తో పాటు.. eMMC 5.1 స్టోరేజీని ఇచ్చారు. ర్యామ్‌ను అదనంగా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజీని కూడా ఎస్‌డీ కార్డు హాయంతో పెంచుకోవచ్చు ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 బేస్డ్‌ ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

అలాగే ఈ ఫోన్‌లో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. దీంతో ఈ ఫోన్‌ ఏకంగా 62 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో.. వైఫై, బ్లూటూత్‌ 5.2, ఓటీజీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్‌ సీ, ఎఫ్‌ఎమ్‌ రేడియో వంటి ఫీచర్లను అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ బరువు 185 గ్రాములుగా ఉంది. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9499గా నిర్ణయించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..