ఐఫోన్ అనేదానిని ఓ స్టేటస్ సింబల్ గా చాలా మంది భావిస్తుంటారు. దాని నుంచి ఏ కొత్త ఫోన్ వచ్చినా ప్రజల్లో బాగా ఆసక్తి ఉంటుంది. ఇటీవలే ఐఫోన్ 15 ను యాపిల్ సంస్థ లాంచ్ చేరింది. కొన్ని నెలలుగా ఇది మంచి సేల్స్ రాబడుతోంది. ఈ క్రమంలో మరో కొత్త మోడల్ ను కంపెనీ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అది ఐఫోన్ 16 సిరీస్ నుంచి వస్తోంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వెర్షన్ ను తీసుకొచ్చేందుకు యాపిల్ కసరత్తు చేస్తోంది. పాత మోడళ్లతో పోల్చితే ఇది పెద్ద డిస్ ప్లే తో వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో దీని లాంచింగ్ ఉండొచ్చని చెబుతున్నారు. అయితే దీని లాంచింగ్ కు ముందే ఈ ఫోన్ కు సంబంధించిన చిత్రాలు, ఇతర వివరాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఎక్స్ లో టిప్ స్టర్ షేర్ చేసిన ఈ చిత్రాలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇప్పటికే ఈ యాపిల్ 16 సిరీస్ గురించి కొన్ని అంశాలు ఆన్ లైన్ సమాచారం ఉంది. వాటిల్లో ప్రత్యేకమైన కెమెరా క్యాప్చర్ బటన్ ఒకటి. ఇప్పుడు ఎక్స్ లో టిప్ స్టర్ లీక్ చేసిన చిత్రాల్లో కూడా ఈ క్యాప్చర్ బటన్ స్పష్టంగా కనిపిస్తోంది. టిప్ స్టర్ మొత్తం మూడు చిత్రాలు తన ఎక్స్ లో షేర్ చేశారు. ఈ మూడు చిత్రాల్లో యాపిల్ ఫ్లాగ్ షిప్ అయిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డమ్మీ యూనిట్లు ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇది ఇంతకు ముందు మోడల్ స్క్రీన్ దాని మునుపటి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే దాదాపు 0.2ఎంఎం పెద్దదిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఫోటోల్లో మాత్రమే అలా కనిపిస్తోందని, వాస్తవంగా అలా ఉండే అవకాశం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉన్నట్లు చూపుతున్నారు. ప్రస్తుత లీక్ ల నుబట్టి కనిపిస్తున్న ఈ కెమెరా మాడ్యూల్ పరిమాణం కూడా పెద్దగానే కనిపిస్తోంది. అయితే ఈ చిత్రాలను నమ్మడానికి లేదని, వాస్తవ రూపం మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఐఫోన్ 16 సిరీస్ హార్డ్ వేర్ కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ప్రధానంగా దీనిలో కెమెరా క్యాప్చర్ బటన్ రావొచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే లీకైన చిత్రాల్లో కూడా ఈ బటన్ కనిపిస్తోంది. ఈ యాపిల్ ఐఫోన్ 16 లైనప్ లో మొత్తం నాలుగు మోడళ్లు ఉన్నాయని.. వీటన్నింటిలో ఈ కొత్త క్యాప్చర్ బటన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు గతంలో ఆన్ లైన్ లో పలు నివేదికలు వచ్చాయి. అయితే ఇంకో కొత్త అప్ డేట్ ఎంటంటే.. ఐఫోన్ 15 ప్రో మోడల్లోని యాక్షన్ బటన్ కొత్త వెర్షన్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ లలో కూడా రావొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..