ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన తొషిబా కంపెనీ ఇప్పుడు ఆ వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకుంది. జపాన్‌కు చెందిన టెక్ దిగ్గజం తొషిబా ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకుంది. ఈ కంపెనీ తన డైనాబుక్ ల్యాప్‌టాప్ బ్రాండ్‌లో 19.9 శాతం వాటాను షార్ప్ సంస్థకు విక్రయించింది. దీనితో ఈ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగినట్టైంది. గతంలోనే తొషిబా కంపెనీ 80.1 శాతం వాటాను షార్ప్‌కు విక్రయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ”డైనాబుక్‌లోని మిగిలిన 19.9 వాతం వాటాను కూడా షార్ప్ కార్పొరేషన్‌కు బదలాయించాము. దీనితో అధికారికంగా డైనాబుక్ ఇప్పుడు షార్ప్‌కు అనుబంధ సంస్థగా మారిందంటూ” తొషిబా ప్రకటన చేసింది.
కాగా 1990 నుంచి 2000 వరకూ తొషిబా ల్యాప్‌టాప్‌ల తయారీలో టాప్ కంపెనీల్లో ఉండేది. ఆ కంపెనీ తయారు చేసిన శాటిలైట్ ల్యాప్‌టాప్‌లు భారీ విజయం సాధించాయి. కానీ తర్వాత లెనోవా, హెచ్‌పీ, డెల్ వంటి కంపెనీలు రంగ ప్రవేశం చేసి మార్కెట్‌పై భారీగా పట్టు సాధించాయి. ఈ క్రమంలో ఇతర మార్కెట్ల నుంచి తొషిబా తీవ్ర పోటీని ఎదుర్కోవలసి వచ్చింది.
Read More:
పవర్ స్టార్ బర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వకీల్ సాబ్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్’