Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే టాప్ 5 స్కూటర్లు ఇవే!

Fastest Charging Electric Scooters: 2026లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆప్షన్. అయితే చాలా మందిని వేధించే సమస్య 'ఛార్జింగ్ టైమ్'. అందుకే, తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే టాప్ 5 స్కూటర్ల గురించి తెలుసుకుందాం..

Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే టాప్ 5 స్కూటర్లు ఇవే!
Electric Scooters

Updated on: Apr 13, 2026 | 6:59 PM

Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇప్పుడు మునుపటి కంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా మారింది. ముఖ్యంగా ‘ఛార్జింగ్ వేగం’ విషయంలో కంపెనీలు భారీ మార్పులు తీసుకువచ్చాయి. మీరు ఆఫీసుకో లేదా లాంగ్ రైడ్‌కో వెళ్లాలనుకున్నప్పుడు గంటల తరబడి ఛార్జింగ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. 2026లో మార్కెట్లో అందుబాటులో ఉన్న వేగంగా ఛార్జ్ అయ్యే టాప్ 5 స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

  1. ఓలా S1 ప్రో (3rd Gen) – వేగంలో కింగ్: ఓలా నుంచి వచ్చిన లేటెస్ట్ జెనరేషన్ స్కూటర్ ఛార్జింగ్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. వీరి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా కేవలం 12 నుండి 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అత్యవసర సమయాల్లో ఇది ది బెస్ట్ ఆప్షన్.
  2. సింపుల్ వన్ (Simple One): ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ ఛార్జింగ్ స్పీడ్ కూడా అద్భుతం. ఇది సుమారు 2 గంటల 15 నిమిషాల్లో 0% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది. లాంగ్ రేంజ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.
  3. బజాజ్ చెతక్ C2501: నమ్మకానికి మారుపేరుగా నిలిచే బజాజ్ చెతక్, ఇప్పుడు ఛార్జింగ్ వేగంలోనూ దూసుకుపోతోంది. ఈ మోడల్ కేవలం 2 గంటల 25 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో ఛార్జ్ అయ్యి ప్రయాణానికి సిద్ధమవుతుంది. ఈ సెగ్మెంట్‌లో ఇది అత్యంత వేగవంతమైన స్కూటర్లలో ఒకటి.
  4. టీవీఎస్ iQube (TVS iQube): భారతదేశంలో ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే ఈ స్కూటర్, పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ మధ్య మంచి బ్యాలెన్స్ పాటిస్తుంది. ఇది 0% నుండి 80% వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 45 నిమిషాలు పడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏథర్ 450 సిరీస్, రిజ్టా (Ather 450 Series): ఏథర్ ఎనర్జీ తమ స్మార్ట్ ఫీచర్లకు ప్రసిద్ధి. వీరి స్కూటర్లు (ముఖ్యంగా 450X మరియు కొత్త రిజ్టా) సాధారణంగా 4 గంటల 30 నిమిషాల్లో 80% ఛార్జింగ్‌ను పూర్తి చేసుకుంటాయి. అయితే ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల వద్ద ఇది ఇంకా వేగంగా ఛార్జ్ అవుతుంది.

మీరు ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే ఓలా లేదా సింపుల్ వన్ వైపు చూడవచ్చు. అదే సిటీలో ఫ్యామిలీతో కలిసి తిరగడానికి అయితే బజాజ్ చెతక్ లేదా టీవీఎస్ iQube బెస్ట్ ఆప్షన్స్. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకోండి.

ఇది కూడా చదవండి: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఈ నగల వ్యాపారుల భారీ డిస్కౌంట్లు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us