Whatsapp: యూజర్ల భద్రత కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్‌.. సేఫ్టీ ఇన్ ఇండియా పేరుతో..

|

Feb 23, 2022 | 7:35 AM

Whatsapp: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనివార్యంగా మారుతోంది. అయితే టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో అదే స్థాయిలో సైబర్‌ నేరాలు (Cyber Crime) సైతం పెరుగుతున్నాయి. రోజుకో కొత్త రకం ఆన్‌లైన్‌ మోసం వెలుగులోకి...

Whatsapp: యూజర్ల భద్రత కోసం మరో ముందడుగు వేసిన వాట్సాప్‌.. సేఫ్టీ ఇన్ ఇండియా పేరుతో..
Whatsapp
Follow us on

Whatsapp: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనివార్యంగా మారుతోంది. అయితే టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో అదే స్థాయిలో సైబర్‌ నేరాలు (Cyber Crime) సైతం పెరుగుతున్నాయి. రోజుకో కొత్త రకం ఆన్‌లైన్‌ మోసం వెలుగులోకి వస్తూనే ఉంది. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా సైబర్‌ నేరాలు మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (Whatsapp) రంగంలోకి దిగింది. తమ యూజర్లకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన పెంచేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ‘సెఫ్టీ ఇన్‌ ఇండియా’ పేరుతో వాట్సాప్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ‘సెఫ్టీ ఇన్‌ ఇండియా’ రిసోర్స్‌ హబ్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది.

సెఫ్టీ ఇన్‌ ఇండియా ప్రోగ్రామ్‌పై వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌ మాట్లాడుతూ.. ‘యూజర్ల భద్రతే వాట్సాప్‌కు అన్నింటికంటే ముఖ్యం. వారికి ఆన్‌లైన్‌లో భద్రతపరంగా అవగాహన కల్పించాలన్న మా లక్ష్యంలో భాగంగా సేఫ్టీ ఇన్‌ ఇండియాను అందుబాటులోకి తెచ్చాం. ఈ ప్రోగ్రామ్‌తో ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో సైబర్‌ దాడుల బారిన పడకుండా యూజర్లు తమను తాము ఎలా కాపాడుకోవాలి, సైబర్‌ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి విషయాలపై అవగాహన కల్పిస్తాము.

అంతేకాకుండా ఆన్‌లైన్‌ సెక్యూరిటీ, గోప్యత, వంటివి వాటిపై రిసోర్స్‌ హబ్‌ దృష్టి సారిస్తుంది. ఆన్‌లైన్‌ భద్రతపై యూజర్లకు అవగాహన కల్పించడమే సేఫ్టీ ఇండియా ప్రధాన లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు. మరి వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ సెఫ్టీ ఇన్‌ ఇండియా కార్యక్రమం సైబర్‌ నేరాలకు ఏమేర చెక్‌ పెడుతుందో చూడాలి.

Also Read: TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి

IND vs SL: రోహిత్ శర్మ ఖాతాలో చేరనున్న భారీ రికార్డు.. మరో 12 సిక్సులు కొడితే..!

Knowledge: ఎంత పెద్ద వానలోనైనా ప్రతి చినుకును తప్పించుకుని తడవకుండా గూటికి చేరే ఏకైక పక్షి ఏదో తెలుసా?